నగరాన్ని కనిపెట్టిన ఓ బాలుడు | Forgotten Mayan city 'discovered' in Central America by 15 year old

Forgotten mayan city discovered in central america by 15 year old

America, Mayan city, Central America, William Gadoury, అమెరికా, విలియం గడౌరీ, మయాన్

A 15-year-old boy believes he has discovered a forgotten Mayan city using satellite photos and Mayan astronomy. William Gadoury, from Quebec, came up with the theory that the Maya civilization chose the location of its towns and cities according to its star constellations.

నగరాన్ని కనిపెట్టిన ఓ బాలుడు

Posted: 05/11/2016 03:39 PM IST
Forgotten mayan city discovered in central america by 15 year old

చిన్న బుర్రలే అయినా కానీ పెద్ద ఆలోచనలు ఇప్పటి చిన్నారులు,. అలానే ఎంతో మంది పరిశోధకుల వల్ల సాధ్యం కాని పనిని ఓ చిన్నారి చేశాడు. చరిత్రలోనే నిలిచిపోయేలా ఆ చిన్నారి ఓ నగరాన్ని గుర్తించాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన ఓ పదిహేనేళ్ల విలియం గడౌరీ అనే పిల్లోడు కనుగొన్న ఆ నగరం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం నాటి మాయ నాగరికతలో కళలు, గణితం, సంస్కృతికి ఎంతో ప్రాచుర్యం ఉంది. అప్పటి ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పురాతన కట్టడాలు, నిర్మాణాలు మెక్సికన్‌ అడవుల్లో బయటపడ్డాయి. 2014లోనూ పురావస్తు శాఖ పరిశోధకులు 2 పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే దట్టమైన మెక్సికన్‌ అడవుల్లో దాగి ఉన్న మరో నగరాన్ని గుర్తించలేకపోయారు.

తాజాగా ఆ నగరాన్ని పదిహేనేళ్ల బాలుడు గుర్తించాడు. అతని పేరు విలియం గడౌరీ. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాల నడుమ ఉన్న నగరం ఉన్నట్లుగా ఆనవాళ్లను అతను గుర్తించడం గమనార్హం. తాను చదివిన ఓ పుస్తకం కారణంగానే తాను నగరాన్ని గుర్తించినట్లు చెప్పాడు. మాయ నాగరికత కాలంలో నిర్మించిన దాదాపు అన్ని నగరాలు నదులకు దూరంగా, మారుమూల ప్రాంతాలు, పర్వతాల నడుమే ఉన్నాయని పుస్తకంలో తెలుసుకున్నానని చెప్పాడు. దీంతో, నదులకు దూరంగా నివాసాలను ఎందుకు కట్టారు అని తెలుసుకోవాలనుకున్నాడు. దానిపై అధ్యయనం చేశాడు. అప్పట్లో ప్రజలు నక్షత్రాలను పూజించేవారని ఆ బాలుడు తెలుసుకున్నాడు. నక్షత్రాల స్థానాలను బట్టి ఆ నగరాలను నిర్మించి ఉండొచ్చన్న కోణంలో పరిశోధించాడు. ఆ నక్షత్రాల స్థానాలను మ్యాప్‌పై పెట్టాడు. అది నిజమే అయింది. ఇప్పటి దాకా పరిశోధకులు గుర్తించిన నగరాలన్నీ 22 సమూహాలకు చెందిన నక్షత్రాల స్థానాలకు అనుగుణంగానే ఉన్నట్లు తేలిందని చెప్పాడు. అయితే, ఒక నగరం మాత్రం ఎక్కడుందో తెలియలేదట. దానికోసం గూగుల్‌ ఎర్త్‌తో వెతికి తాజాగా ఆ నగర ఆనవాళ్లను గుర్తించానని చెప్పాడు. కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహం తీసిన ఫొటోలో చతురస్రాకారంలో ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఎవరూ వెళ్లేందుకు వీలులేకుండా ఆ ప్రాంతం ఉంది. దానికి కాక్ చి అని పేరు పెట్టాలని ఆ బాలుడు నిర్ణయించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles