Gutsy German shepherd saves SAS lives when troops were ambushed by ISIS in northern Iraq

Us military alsatian dog takes on isis jihadis

London, US military, military dog, brave dog, Alsatian dog, ISIS jihadis, ISIS terrorists, U.S. attack, Islamic State, ISIS fighters, Brit soldiers, British Special Forces

A military dog has been hailed a hero after saving a team of British Special Forces from a group of ISIS fighters who ambushed them in northern Iraq.

సింహంలా శత్రువర్గాలపై ఎదురుతిరిగిన గ్రామసింహం..

Posted: 05/10/2016 07:56 PM IST
Us military alsatian dog takes on isis jihadis

అది గ్రామ సింహం. కానీ సింహం మాదిరిగా శత్రుసైన్యాన్ని తరమింది, శత్రువుల వద్ద పదునైన అయుధాలు వున్నాయన్న విషయం గురించి దానికి తెలియదు, వాళ్లు తలుచుకుంటే తన ప్రాణాలు తృణప్రాయంలా చట్టుకున్న కోండెక్కుతాయన్న భయం కూడా దానిలో ఏ కోశాన లేదు. దానిలో వున్నదంతా తన వారిని రక్షించాలన్న పట్టుదల ఒక్కటే. అదే చేసింది, తన బ్రిటిష్ సైన్యాన్ని రక్షించిన మిలటరీ డాగ్ ఇప్పుడు వార్తల్లో హీరో అయిపోయింది. ఏభైమంది ఐసిస్ సమూహాన్ని దీటుగా ఎదుర్కొని బ్రిటిష్ ప్రత్యేక దళాలపై విశ్వాసాన్ని చూపింది. సాస్ సైనికులు పది రోజుల ట్రైనింగ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ఫైటర్లనుంచి రక్షించి ప్రత్యేకతను చాటింది.

నాలుగు వాహనాల కాన్వాయ్ లో బ్రిటిష్ సైనిక దళాలతో పాటు ప్రయాణిస్తున్న అల్సేషన్ డాగ్... కుర్షిద్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే అనుకోకుండా  జిహాదీల సమూహానికి చిక్కారు.  గతనెల్లో సుమారు ఏభైమంది ఐసిస్ సభ్యులు ఓ హోం మేడ్ బాంబుతో సైన్యంపై దాడికి దిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సైన్యంపై వెనుకనుండి దాడి చేశారు. అదే సమయంలో కాన్వాయ్ లో సైనికులతో పాటు ప్రయాణిస్తున్న మిలటరీ డాగ్ తన ప్రతాపం చూపింది. కోపంతో ఉగ్రరూపం దాల్చింది. ఐసిస్ దళాలపై విరుచుకు పడింది. ఓ జిహాదీని మైడపైనా, ముఖంపైనా కరిచింది. మరో జిహాదీ చేతులు, కాళ్ళను పట్టుకు పీకేసింది.

ఆల్సేషన్ కుక్క టెర్రర్ కు ఐసిస్ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. కుక్క భయానికి అక్కడినుంచీ పారిపోయారు. ఐసిస్ దాడులనుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోకుండా.. ఆ కుక్క వీరోచితంగా పోరాడి తమ సైనికులను రక్షించడం అభినందించాల్సిన విషయమని, అందుకు దానికి ఎంతో తర్ఫీదు ఇచ్చి ఉంటారని ఘటన అనంతరం అంతా మెచ్చుకున్నారు. ఆల్సేషన్ దగ్గరకు వస్తే సాధారణ మనుషులైతే భయపడతారు. కానీ జిహాదీలను సైతం తీవ్రంగా భయపెట్టి, వారిని దీటుగా ఎదుర్కొని తన బాధ్యతను నిర్వర్తించడం నిజంగా ఆశ్చర్యకరమని అంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Military  Alsation dog  ISIS  jihadis  saves  British soldiers  

Other Articles