దేవుడిని అరెస్టు చేయాలని కోర్టుకెక్కాడు | A petetion to Arrest God

A petetion to arrest god

God, Israil, Arrest God, Court, కోర్టు, దేవుడు, ఇజ్రాయెల్

A Israil citizen file a petetion to arrest God. He complaimts that God not supporting him.

దేవుడిని అరెస్టు చేయాలని కోర్టుకెక్కాడు

Posted: 05/09/2016 04:39 PM IST
A petetion to arrest god

అంతా పైవాడు చూసుకుంటాడు.. మన చేతిలో ఏముంది అంతా దేవుడు చేసిందే అంటూ మనం మామూలుగా మాట్లాడుకుంటుంటాం. అన్నింటికి దేవుడితో లింక్ చేస్తుంటాం. ఓ ప్రబుద్దుడు మాత్రం కోర్టులో ఓ పిటిషన్ వేశాడు. దేవుడిని అరెస్టు చేసి తన ముందు నిలబెట్టాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడంలేదని కూడా ఆయన పేర్కొన్నారు. పాపం దాంతో కోర్టులో న్యాయమూర్తులు సైతం షాకయ్యారు. అసలు దేవుడిని అరెస్టు చెయ్యాలని అనడం ఏంట్రా బాబు అంటూ నెత్తి గోక్కున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇజ్రాయెల్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో ఓ పిటిషన్ వేశాడు. దేవుడు తనపై కరుణ చూపడం లేదని.. చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడుతున్నానని.. అయినా నా కష్టాలను తీర్చకుండా దేవుడు వేడుక చూస్తున్నాడని పిటిషన్ లో వివరించాడు. ఇంత జరుగుతున్నా దేవుడు ఏ మాత్రం సాయం చేయడం లేదని, అందుకే ఆయనను వెంటనే అరెస్టు చేసి తన ముందుకు తీసుకువచ్చేలా పోలీసులను ఆదేశించండి.. నేరుగా కడిగేస్తా అని అనడంతో కోర్టులో న్యాయమూర్తులు ఖంగుతిన్నారు. దేవుడితో కాకుండా వేరేలా కష్టాలను తీర్చుకోవాలని అందుకు ప్రభుత్వం సహకారం తీసుకోవాలని ఆయనకు కోర్టు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : God  Israil  Arrest God  Court  కోర్టు  దేవుడు  ఇజ్రాయెల్  

Other Articles