Yogi Adityanath rides tiger; opposition leaders ride donkeys

Poster from uttarpradesh minority cell pulls bjp into controversy

Poster War in UP, uttarpradesh minority cell, controversial poster, MP Yogi Adityanath, Yogi Adityanath rides tiger, opposition leaders ride donkeys, Akhilesh Yadav, Mayawati, Asaduddin Owaisi, Rahul Gandhi, BJP, congress, samajwadi party, bahujan samajwadi party, AIMIM

A poster of the BJP minority wing in UP showed local MP Yogi Adityanath riding a tiger while the opposition leaders like Akhilesh Yadav, Mayawati, Asaduddin Owaisi and Rahul Gandhi were seen riding a donkey.

వివాదానికి దారితీసిన పోస్టర్.. బీజేపికిది అలవాటంటూ విమర్శలు

Posted: 05/09/2016 03:24 PM IST
Poster from uttarpradesh minority cell pulls bjp into controversy

దేశంలో బీజేపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, మరోలా చెప్పాలంటే నరేంద్రమోడీ ప్రధాని పగ్గాలను అందుకున్న నాటి నుంచి దేశవ్యాప్తంగా జేపి నాయకుల వివాదాస్పద చర్యలకు అది అంతు లేకుండా పోయింది. ఢిల్లీలోని సాధ్వీ ప్రాఛీ, సాధ్వీ సరస్వతి ఇలా ఎంతమంది నాయకుల పేర్లు చెప్పుకున్నా.. వారందరూ దేశ ప్రజలకు గుర్తుండేలా చేసింది సమాజ హిత కార్యక్రమాలు కాదు. అంతకన్నా కాంట్రవర్సీ మ్యాటర్ లోకి దూరో లేక కాంట్రవర్సీ మాటలు చెప్పో వీరు దేశ ప్రజలకు గుర్తుండిపోయారు.

బీజేపి పార్టీ సమావేశంలో స్వయంగా ప్రధాని మోడీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని, పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసిన వారిని ఇకపై ఉపేక్షించబోమని హెచ్చరించే స్థాయి వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుంది. ఒక కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్వయంగా ప్రధాని పార్లమెంటు ఉభయ సభలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ బీజేపి నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ తాము వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తూనో, లేక వివాదాస్పద పోస్టర్ల ప్రచురణతోనో కాంట్రవర్సీలు చేస్తునే వున్నారు.

పక్కవాళ్లు ఏంచేసినా.. సహించే స్థితిలో లేరు సరికదా, వారికన్నా  తామేం తక్కువ తిన్నామా అన్న విధంగా వివాదాలను కొని తెచ్చుకోవడంలో మాత్రం ఘనాపాటీలుగా తయారవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో అక్కడి కాంగ్రెస్ నేతల తమ యువనేత రాహుల్ గాంధీని నాయకుడిగా అభివర్ణిస్తూ.. సింహంపై అయన సవారీ చేస్తున్నట్లు ఓ పోస్టర్ ను తయారు చేయించి ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రధాన కూడళ్లలో వాటిని అందరికీ వీలుగా వుండేలా అమర్చారు. అంతే దీనిని జీర్ణంచుకోలేకపోయిన బీజేపి నేతలు వివాదానికి కాలుదువ్వారు.

రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ రూపోందించిన ఓ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం తయారు చేయింది అంటించింది. ఒక్క రాహులే కాదు. అయనను మాత్రమే కాదు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణించారు.

'2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మోత మోగిస్తుంది. మేం యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం' అని ఆ విభాగం పేర్కొనగా.. సమాజ్ వాది పార్టీ నేతలు గట్టి కౌంటర్ వేశారు. తాము శాంతియుత పౌరులం అని.. అశాంతితో కూడిన మనస్తత్వం కలిగినవారే పులులపై సవారీ చేస్తారు అని మహానగర్ అధ్యక్షుడు మోసిన్ ఖాన్ చెప్పారు. కాగా, బీజేపీ చేసిన ఈ పనిపట్ల తాము నిరసన వ్యక్తం చేస్తామని, ఈ చర్య పూర్తిగా ఖండిచందగినదని ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ సిద్దిఖీ అన్నారు. కాగా బీజేపి నేతలపై మాత్రం ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : controversial poster  BJP  Yogi Adityanath  Uttar Pradesh  

Other Articles