సోనియాగాంధీ ఓ సివంగి | Sonia a sherni

Sonia a sherni

congress, Sonia Gandhi, parliament, Jyotiraditya, India, Italy, Agusta scam, BJP, సొనియాగాంధీ, కాంగ్రెస్, జోతిరాదిత్య

Congress leader Jyotiraditya Scindia on Friday called his party president Sonia Gandhi a “sherni (lioness)” and cautioned ruling Bharatiya Janata Party (BJP) members against making “false and baseless” accusations against her over AgustaWestland deal.

సోనియాగాంధీ ఓ సివంగి

Posted: 05/07/2016 08:08 AM IST
Sonia a sherni

అగస్టా అవకతవకల మూలాలన్ని అప్పటి ఎన్డీఏ ప్రభు త్వం కేంద్ర బిందువుగా ఉన్నాయ ని, వాటిని కప్పిపుచ్చుకో వడానికి తమ పార్టీపై దాడికి దిగడం తగ దని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శిం చింది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని తాము డిమాం డ్ చేస్తున్నామని, అప్పుడే నిజాని జాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సోనియా సివంగి లాంటి వారు..ఇలాంటి వాటికి బయపడరని అన్నారు. కేంద్రం పనిగట్టుకుని కాంగ్రెస్‌పై ఆరోపణలకు దిగితే లాభం లేదని, గత ఎన్డీఎ హయాంలోనే ఈ కొనుగోళ్ల ప్రక్రియ మొదలు అయిందని , పరస్పర ఆరోపణలు మాని ఒప్పందం తీరుతెన్నులపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, సభలో ప్రతి మూడు నెలలకోసారి దీనిపై నివేదికలను సింధియా డిమాండ్ చేశారు.

అగస్టాపై సావధాన తీర్మానంపై జరిగిన చర్చలో యువనేత జ్యోతిరాదిత్య తమ ప్రసంగంలో రక్షణ మంత్రి పారికర్‌కు సమాధానం ఇచ్చారు. బిజెపి వారికి ఇతరులను నిందించి తమ పబ్బం గడుపుకోవడం అలవాటైన పని అని దుయ్యబట్టారు. వారు తప్పుడు ఆరోపణలకు అలవాటు పడ్డారని, ఈ క్రమంలో అయోమయం కల్పించేందుకు యత్నిస్తున్నారని, ఇదంతా వారి మాయాజాలంలో భాగం అని సింధియా విమర్శించారు. అయితే ఈ మాయాజాలాన్ని ఛేదించాలని వారి దూకుడును అడ్డుకోవాలని తాము (కాంగ్రెస్ వారు) కూడా పట్టుదలతో ఉన్నారని , ప్రతిన వహించారని , అన్ని అంశాలను సభముందు, ప్రజల ముందు ఉంచి తీరుతామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సారధ్యంలో దర్యాప్తు జరిగితే అందరికీ మంచిదని తెలిపారు. ఎన్డీఎ హయాంలో 1999లో ఈ ఒప్పంద ప్రక్రియ మొదలైందని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles