తెలంగాణలో మరో 15 జిల్లాలు | Fifteen new districts in telangana

Fifteen new districts in telangana

Telangana, New Districts, State, KCR, CMO, New Divisions, తెలంగాణ, జిల్లాలు, కేసీఆర్

Telangana CM KCR decided to new fifteen new districts. CMO already issue orders to give report on this.

తెలంగాణలో మరో 15 జిల్లాలు

Posted: 05/06/2016 09:10 AM IST
Fifteen new districts in telangana

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అత్యున్నత స్థాయి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన సీఎం కేసీయార్ జూన్ 2 రాష్ట్ర అవతరణదినాన కొత్త జిల్లాల ప్రకటనను అధికారికంగా వెల్లడించనున్నారు… అంతేకాదు, ఆగస్టు 15 స్వాత్రంత్ర దినాన గానీ కొత్త జిల్లాలు అధికారికంగా ఏర్పడాలని సీఎం ఆకాంక్షించారు… ఇంకా పలుచోట్ల కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయనీ, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించాలని, జూన్ 2 నాటికి ప్రజలకు పూర్తి స్పష్టత ఇద్దామని సీఎం కేసీఆర్ అధికారగణానికి స్పష్టం చేశారు… కొత్త జిల్లాలతోపాటు మరో 40 మండలాలు కూడా కొత్తగా ఏర్పాటు కానున్నాయి… 29 వరకూ కొత్త డివిజన్లు కూడా ఏర్పాటయ్యే వీలుంది…

పరిపాలన యూనిట్లు చిన్నగా ఉంటే ప్రభుత్వపాలన మరింత సమర్థంగా ఉంటుందనే భావన చాలాకాలంగా ఉన్నదే… ఎలాగూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టు జిల్లాలు కూడా పెరగాల్సిన అవసరముందని కేసీయార్ చెబుతూ వస్తున్నారు… ఎట్టకేలకు దీనికి మోక్షం లభించనుంది… కానీ తమ ప్రాంతమే జిల్లా కావాలనీ, తమ ప్రాంతం ఫలానా జిల్లాలో మాత్రమే కలపాలనీ, తమ ప్రాంతాన్ని కదిలించవద్దని… ఇలా చాలా చాలా డిమాండ్లు, ఆందోళనలు కొంతకాలంగా ఉన్నాయి. ఇప్పుడిక అధికారిక నిర్ణయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఇంకా పెరగనున్నాయి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles