ఇండియాలోనే కూలీ నెంబర్ వన్ అతడే..? | Do u know who is cooli no one in India

Do u know who is cooli no one in india

Modi, narendra Modi, Modi in UP, Modi as cooli, మోదీ, నరేంద్ర మోదీ, కూలీ నెంబర్ వన్

Prime Minister Narendra Modi launched Ujjwala Yojana, a scheme to provide free LPG connections to 5 crore poor families over the next three years, from Ballia in the poll-bound Uttar Pradesh.

ఇండియాలోనే కూలీ నెంబర్ వన్ అతడే..?

Posted: 05/02/2016 07:46 AM IST
Do u know who is cooli no one in india

మేడే సందర్భంగా చాలా మంది కార్మికులకు శ్రామిక్ శక్తి, శ్రామిక్ నిపున్ లాంటి ఎన్నో అవార్డులు ఇస్తుంటారు. అయితే అసలు ఇండియాలో తానే నెంబర్ వన్ కూలీ అంటూ ఓ రాజకీయ ప్రముఖుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. నిన్నన ఉత్తర్ ప్రదేశ్ లోని బలియాలో ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రదాన్ మంత్రి ఉజ్వల యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను భారతదేశంలో కూలి నెంబర్ 1 అనీ, అందువల్లనే కార్మిక దినోత్సవం నాడు ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేదరికంలో ఉన్న ఐదు కోట్ల మంది గృహిణులకు వంట గ్యాస్ కనెక్షన్ కల్పించే ఈ పథకం వల్ల ఎన్నో ఇళ్లలో వెలుగు వస్తుందని పేర్కొన్నారు.

పేదరికం, కనీసం కిటికీలేని ఇళ్లలో పుట్టి పెరగడం వల్ల తనకు కష్టాలు, కన్నీళ్లు తెలుసునని, అలాంటి చీకటి గదుల్లో పొగలో కట్టెల పొయ్యిపై తల్లులు వంటచేయడానికి పడే ఇబ్బందులు తెలుసునని మోదీ గుర్తుచేసుకున్నారు. దేశంలో మారుమూల ప్రాంతమైన తారిఘాట్, - ఘజియాపూర్- మవూ రైల్వే లైన్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయంగా తృప్తి కలిగించిందన్నారు. రైలు, బ్రిడ్జీలు, రోడ్డు సౌకర్యం లేని బలియాను ఈ పథకం ప్రారంభించేందుకు తాను ఎన్నుకున్నట్లు మోదీ తెలిపారు. పథకాలు పేదలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి తప్ప, ఓటు బ్యాంకు పై దృష్టితో కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles