Aditya Pancholi slams Adhyayan Suman for dragging his name in the Hrithik-Kangana controversy!

Aditya pancholi unmasks adhyayan suman s lie in the kangana ranaut hrithik roshan controversy

kangana ranaut, hrithik roshan, kangana, Aditya Pancholi, Adhyayan Suman, Prabhas, BMW, Ek niranjan, celebrities, kangana ranaut, hrithik, kangana ranaut hrithik roshan, kangana ranaut news, hrithik roshan news, kangana ranaut hrithik roshan news, kangana hrithik news, kangana ranaut emails, hrithik roshan emails, entertainment news

Adhyayan Suman claimed that it was Aditya Pancholi who warned him about Kangana Ranaut. Aditya refrained from commenting even though his name has been dragged into this murky battle.

హృతిక్-కంగనా వివాదం: హీరోకి వార్నింగ్ ఇచ్చిన నటుడు

Posted: 04/30/2016 11:41 AM IST
Aditya pancholi unmasks adhyayan suman s lie in the kangana ranaut hrithik roshan controversy

బాలీవుడ్ సిల్వర్ స్ర్కీన్ పై నటీనటులుగా రాణిస్తున్న హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు తమ నిజజీవితంలోనూ నడిపిన లవ్ ఎఫైర్ కు భీటాలు వారి లీగల్ వివాదం చిక్కుకున్న నేపథ్యంలో రోజురోజుకు ఈ వివాదం వికృతరూపం దాలుస్తోంది. రోజు రోజుకు హృతిక్-కంగన 'ఎఫైర్' కు సంబంధించి అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వివాదంలో మొదటినుంచి హృతిక్ కు మద్దత్తునిస్తుండగా, మరికోందరు కంగనాకు అండగా నిలుస్తున్నారు. ఇంకోందరు తమకెందుకు అన్నవిధంగా మౌనంగా వుంటున్నారు.

ఇటీవల కంగనాతో క్లోజ్ గా వున్న ఫోటో బయటపడే సరికి.. హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ అయనకు మద్దతుగా నిలించింది. ఇలాంటి అనేక ఫోటోలు ఫోటోషాప్ లో చేయవచ్చని కూడా అరోపించింది. ఈ నేపథ్యంలో  కంగనాతో విడిపోయిన బాలీవుడ్ హీరో, మరో మాజీప్రియుడు అధ్యాయన్ సుమన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే  కంగనా, హృతిక్ రోషన్‌ల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన సుమన్ తాజాగా మరిన్నీ అరోపణలు గుప్పించి.. అటు సీనియర్ నటుల ఆగ్రహానికి గురయ్యాడు. అవును మీరు చదవింది నిజమే. ఎందుకంటే మీరే చదవండి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రంలో కంగనా రనౌత్ చేయటానికి కారణం ఓ బీఎండబ్ల్యు కారు అని వ్యాఖ్యానించాడు. తన నాన్న ఓ బీఎండబ్ల్యు కారు నాకు గిప్ట్ గా ఇస్తే.. దానిని చూసిన కంగనా అసూయగా ఫీలయ్యిందని.. దాని సంపాదించేందుకే ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిందని అరోపించాడు, ఆ డబ్బులతో బీఎండబ్ల్యు కొనుక్కుని నాకు చూపించిందని, అంతటి అసూయ, హై టెంపర్ ఉన్న అమ్మాయని చెప్పాడు. అంతేకాదు కంగనాకు చేతబడి లాంటి క్షుద్రవిద్యలు కూడా తెలుసుని ఆరోపించాడు.

అయితే జాతీయ మీడియాతో మాట్లాడుతున్న ఇదే సమయంలో ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు అదిత్యా పాంచోలి పేరును కూడా ప్రస్తావించాడు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ నటడు.. మరోమారు తన పేరును ఎక్కడైనా.. ఎప్పుడైన.. తన అనుమతి లేకుండా ప్రస్తావిస్తే బాగోదని, అలా చేస్తే తాను తీసుకోబోయే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించాడని వార్తలు అందుతున్నాయి. కాగా బాలీవుడ్ సినిమా షూటింగ్ లో వున్న ఆయనను మీడియా తన స్పందనను కోరగా, ఎవరో తన పేరును ప్రస్తావిస్తే.. దానికి తానెలా బాధ్యుడిని అవుతానని, ఈ విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెబుతూ హుందగా వ్యవహరించాడు. అయినా మీడియా వదలకుండా వెంటబడటంతో ఆయన తన పేరును ప్రస్తావిస్తే.. ఆయనపై కేసును పెట్టమంటారా..? అంటూ ఎదురు ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Aditya Pancholi  Adhyayan Suman  Hrithik Roshan  Prabhas  BMW  Ek niranjan  celebrities  Bollywood  

Other Articles