Gujarat announces 10 per cent reservation for people with incomes below Rs 6 lakh pa

Gujarat bjp announces 10 ebc quota for non reserved classes

Patel community, Gujarat, reservation, Hardik Patel, 10 per cent quota, economically backward, all non-reserved castes, anandiben patel

Chief Minister Anandiben Patel told the media that the reservation will be given to all those whose annual income is Rs.6 lakh or less.

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు గుజరాత్ సర్కార్ రిజర్వేషన్లు..

Posted: 04/29/2016 04:14 PM IST
Gujarat bjp announces 10 ebc quota for non reserved classes

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ నూతన తరహా రిజర్వేషన్ కు శ్రీకారం చుట్టి.. బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు అమె ప్రకటించారు. గుజరాత్ దివస్ ను పుసర్కరించుకుని మే 1 నుంచి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని, అగ్రవర్ణాల పేదలకు ప్రకటించిన 10 శాతం కోటా కూడా ఆ పరిథిలోనే అమలవుతుందని తెలిపింది.

రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సమీప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఆమోదంతోనే ఈ నిర్ణయం వెలువడినట్లు సమాచారం. ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల ప్రయోజనాలకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నస్పందనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏమేరకు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుందో వేచి చూడాలి.

అటు హర్యానాలోనూ జాట్ల డిమాండ్లకు తలొగ్గిన మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆ వర్గానికి విద్య, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం పాఠకులకు విధితమే. పలు రాష్ట్రాల్లో ఉన్నత వర్గాలుగా పేరుపొందిన కులాల్లోని పేదలు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కుతోన్న పరిస్థితుల్లో నిన్న హర్యానా, నేడు గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించిన నిర్ణయాలు ఉద్యమాలకు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే హర్యానా, గుజరాత్ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో వుండటం మరోమారు ఉద్యమకారులకు చేతినిండా పనికల్పించినట్లు అవుతుందన్నవార్తలు వుస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patel community  Gujarat  reservation  Hardik Patel  anandiben patel  

Other Articles