Kejriwal asks CIC to make public PM Modi's qualification details

Kejriwal asks cic to make details about pm modi s degrees public

Arvind Kejriwal,PM Narendra Modi,Educational qualifications,RTI,Modi educational qualifications,Modi degrees,CIC,Informational Commissioner

Arvind Kejriwal has demanded that details of Prime Minister Narendra Modi's education be made public. In a letter accusing the Central Information Commission of trying to hide facts about the prime minister, the Delhi Chief Minister has said: "Show courage."

ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతలేంటి..?

Posted: 04/29/2016 02:57 PM IST
Kejriwal asks cic to make details about pm modi s degrees public

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతలపై ఎందుకనో సందేహం కలిగింది. ప్రధాని మోడీ విద్యార్హతలు ఏమిటో తెలసుకునేందుకు ఆయన ఏకంగా కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)కి లేఖ రాశారు. ప్రధాని విద్యార్హతలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు.

జపాన్ ప్రధానితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ వెనుక భారతీయ జెండా తలకిందులుగా వున్నా.. ఆ విషయాన్ని ప్రధాని పట్టించుకోకపోవడంపై సందేహం వచ్చిందా..? లేక బ్రిటెన్ ప్రర్యటనలో దేశ జాతీయగీతాన్నిఅలపిస్తుండగానే అడుగులు ముందుకు వేసుకుంటూ కదలిని ప్రధానిని మళ్లీ వెనక్కి పిలిపించడం వల్ల కలిగిన సందేహమేమో కానీ వెనువెంటనే ప్రధాని విద్యార్హతలను ప్రకటించాలని ఆయన తన లేఖలో కేంద్ర సమాచార కమీషనర్ ను కోరారు.

'ప్రధాని మోదీ తన విద్యార్హతల గురించి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా సంబంధిత విభాగాలను అడ్డుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రధానికి ఎలాంటి విద్యార్హతలుగానీ, డిగ్రీలుకానీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముంది' అని కేజ్రీవాల్ హిందీలో రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్  పేరిట రాసిన ఈ లేఖలో సీఐసీ పనితీరుపైనా కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. 'నా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. కానీ ప్రధాని డిగ్రీల గురించి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది సీఐసీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  PM Narendra Modi  Educational qualifications  RTI  CIC  

Other Articles