Kanhaiya’s book “From Bihar to Tihar” to launch on digital platform Juggernaut

Kanhaiya to pen down lessons learnt

kanhaiya kumar, jnu, jnusu, jnusu president,JNU Student Leader, book, Juggernaut, jnusu president kanhaiya kumar, cpi, fine on kanhaiya kumar, abvp, umar khalid, anirban bhattachayra, afzal guru event, anti-india slogans,

Jawaharlal Nehru University Students’ Union president Kanhaiya Kumar’s book “From Bihar to Tihar” will be simultaneously published in Hindi and English by Juggernaut Books later this year.

బీహార్ నుంచి తీహార్ వరకు అనుభవాలను రంగరించనున్న కన్హయ్య

Posted: 04/28/2016 05:38 PM IST
Kanhaiya to pen down lessons learnt

జాతీయవాదం, స్వేచ్ఛవాదంపై జాతీయస్థాయిలో తీవ్రమైన చర్చకు కారకుడైన జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. తనకు జన్మనిచ్చిన బిహార్ నుంచి విశ్వవిద్యాలయం పరిస్థితుల నేపథ్యంలో తానెళ్లిన తీహార్ జైలు వరకు తనకెదురైన అనుభవాలన్నింటినీ రంగరించి అక్షర బద్ధం చేయనున్నాడు. తన జీవితానుభవాలను పుస్తకంగా తీసుకురానున్నాడు. స్కూల్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ దాకా సాగిన ప్రయాణం గురించి ఇందులో పొందుపరచనున్నాడు. బిహార్ నుంచి తీహార్ వరకు తన జీవితంలో జరిగిన ఘటనలను పుస్తకంలో రాయనున్నాడు.

బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థి రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు. 'వ్యక్తులను చంపగలరు కానీ వాళ్ల ఆశయాలను చంపలేరని భగత్ సింగ్ అన్నారు. మేం చేస్తున్న పోరాటం మమ్మల్ని ఎక్కడివరకు తీసుకెళుతుందో తెలియదు. కానీ మా ఆశయాలు పుస్తక రూపంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నామ'ని 28 ఏళ్ల కన్హయ్య కుమార్ అన్నాడు. తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతున్న వైరుధ్యాలను, యువత ఆశ-నిరాశలు, పోరాటాల గురించి రాస్తానని చెప్పాడు. అతడి పుస్తకాన్ని జాగర్ నట్ ప్రచురించనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiya Kumar  JNU Student Leader  book  Juggernaut  

Other Articles