Sussanne supports ex husband Hrithik Roshan in fight against Kangana Ranaut

Sussanne khan finally breaks her silence over hrithik kangana controversy

hrithik roshan, kangana ranaut, sussanne khan, kangana, hrithik, sussanne, hrithik kangana, hrithik kangana news, hrithik kangana controversy, hrithik roshan kangana ranaut controversy, hrithik roshan news, kangana news, entertainment news

Sussanne Khan has come out in support of former husband Hrithik Roshan in his bitter fight with actress Kangana Ranaut. she alleges that intimate photos are photoshopped

హృతిక్-ఖంగానాల ఫోటోపై..మాజీ భార్య సుసానే ఖాన్ ఎలా స్పందించిందో తెలుసా.?

Posted: 04/28/2016 11:47 AM IST
Sussanne khan finally breaks her silence over hrithik kangana controversy

బాలీవుడ్ టాప్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న లీగల్ వివాదం రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాలను తలపిస్తోంది. అసలు వీరి మధ్య ఉన్నది వన్ సైడ్ లవ్వా..? లేక లైవ్ ఎఫైర్ నడిచిందా..? అన్న విషయంలో రోజుకో తాజా వార్త అందుతూ అంతచిక్కని మిస్టరీగా మారింది, మొన్న కంగనా వన్ సైడ్ లవ్ చేస్తోంది అంతుకనే హృతిక్ కు ఏకంగా తన న్యూడ్ ఫోటో పంపించి మరీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందన్న వార్తలు వెలుగుచూశాయి.

కాగా నిన్న ఆయన కంగనాతో చాలా దగ్గెరగా, క్లోజ్ గా ముద్దుపెట్టుకునేంత చెంతలో వున్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలం గుట్టుగా ప్రేమాయణం  సాగిందన్న ప్రచారం జోరందుకుంది. అయితే కంగనా-హృతిక్ ల మద్య నడుస్తున్న ప్రఛ్ఛన్నయుద్దాన్ని ప్రతిరోజూ చూస్తున్న హృతిక్ మాజీ భార్య ఎలా ఫీలవుతున్నారు. ఈ మొత్తం ఘటనపై అమె స్పందన ఏలా వుంది..? అమె మౌనాన్ని విప్పిన పక్షంలో ఎవరికి మద్దతునిస్తారు..? మరో మహిళకా..? లేక మాజీ భర్తకా..?.

ఈ  ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నించిన మీడియా ప్రయత్నాలు అప్పట్లో ఫలించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో కంగనాకు అత్యంత క్లోజ్ గా వున్న హృతిక్ ఫోటో బయటపడటంలో అమె తన మౌనాన్ని బద్దలు కోట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో తాను తన మాజీ భర్తకే మద్దతు పలుకుతానని చెప్పారు. అంతేకాదు కంగనాతో క్లోజ్ గా వున్నట్లు వచ్చిన ఫోటో ఫోటోషాప్ చేయబడిందని అమె అరోపించారు.

గత కొన్నాళ్ల క్రితం మీడియా తాపత్రాయన్ని తెలుసుకున్న సుసానే.. హృతిక్-కంగనల బురద జల్లుకునే పండుగ మధ్యలో అస్సలు ఎంటర్ అవ్వనని ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ కపుల్గా గుర్తింపు ఉన్న హృతిక్-సుసానేలు విడాకులు తీసుకున్నాక ఈ వ్యవహారం బయటపడటంతో.. తన మాజీ భర్త నడిపిన ప్రేమ వ్యవహారంపై ఆమె ఎలా స్పందిస్తారో  తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిచాయి.

ఈ విషయమై ఓ జాతీయ మీడియా ప్రచురించిన వరుస కథనాలు చదివిన సుసానే రెండు రోజుల క్రితం.. 'నేను ఏమనుకుంటున్నానో తెలుసుకోవాలని ఉంది కదా. సో సారీ.. ఎప్పటికీ తెలుసుకోలేరు. మీ ఊహాగానాలు కంటిన్యూ చేయండి' అంటూ ట్వీట్ చేశారు. అంతలోనే హృతిక్, కంగనలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపడి మరింత దుమారం రేపాయి. దీంతో అగలేకపోయిన అమె తన మాజీ భర్తకు మద్దతుగా నిలిచారు. 'ఫొటోషాప్ చేసిన ఫొటోలతో అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారని అరోపించారు, ఈ విషయంలో మాత్రం నా సపోర్ట్ హృతిక్ కే' అని తేల్చాశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood pair love affair  Sussanne Khan  Hrithik Roshan  Kangana Ranaut  Twitter  

Other Articles