ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ పనిమనిషి.. తన బాస్ పై అలా కసి తీర్చుకుంది, విదేశాల నుంచి వచ్చే మహిళలను అక్కడి సంపన్నవర్గాలు తమ ఇళ్లలో పనిలో పెట్టుకుంటారు, అలా పనిలో కుదిరిన ఓ మహిళను అమె ఇంటి యజమాని ఎంతలా వేధించాడో ఏమో తెలియదు కానీ,. అమెకు మాత్రం అతనిపై చాలా కసి వుంది, అయితే తన బాస్ వద్ద మిన్నకుండే ఆ మహిళ తనకు అవకాశం లభించినప్పుడల్లా యజమానిపై కసి తీర్చుకుంది. అది కూడా అలా ఇలా కాదు. తలచుకుంటేనే ఒళ్లు గగ్గుర్పోడిచేలా..
చేయకూడని తప్పు చేసినా ఎంచక్కా పనిలో కొనసాగుతోంది, కాని ఒకరోజు చేసిన తప్పుకు అడ్డంగా దొరికిపోయింది. తన ఇంట్లో వున్న సిసిటీవీలను పరిశీలించే పనిలో భాగంగా చూసిన ఇంటి యజమానికి అసలు విషయం తెలియడంతో షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినబడుతున్నాయి, యజమాని అకృత్యాలకు, అగడాలకు బలైపోయిన మహిళలే వారి మనోవేధనను అదిగమించేందుకు ఇలా చేసివుంటారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి..
కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది. మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more