FIR lodged against BJP's Rupa Ganguly as violence rocks fourth phase of West Bengal Assembly polls

Fir lodged against bjp s rupa ganguly in bengal polls

West Bengal Assembly Election 2016, FIR lodged against BJPs Rupa Ganguly, Fourth phase of West Bengal Assembly Elections 2016, Howrah, North 24 Parganas, Kolkata, Mamata Banerjee, All India Trinamool Congress, Lakshmi Ratan Shukla, Draupadi, Mahabharata, Communist Party of India-Marxist, Tanmoy Bhattacharya, North Dum Dum,

First Information Report (FIR) was registered against BJP’s Rupa Ganguly after an alleged scuffle with a TMC worker at a polling booth in Howrah.

తృణముల్ కార్యకర్తపై చేయిచేసుకున్న రూపా గంగూలీ.. కేసు నమోదు..

Posted: 04/25/2016 05:23 PM IST
Fir lodged against bjp s rupa ganguly in bengal polls

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మహిళా నేత, నటి రూపా గంగూలీపై కేసు నమోదైంది. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తపై చేయిచేసుకున్నారన్న అరోపణల నేపథ్యంలో అమెపై పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటిగా రూపా గంగూలీ బాగా రాణించడంతో అమెను రాజకీయ అరంగ్రేటం చేయించిన బీజేపి. హౌరా నుంచి బరిలోకి దింపింది. దీంతో అమె తన నియోజకవర్గంలో తన శక్తి మేరకు శ్రమించి ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రజలు తీర్పును ఇవ్వనున్న నేపథ్యంలో అమె ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తను పోలింగ్ బూత్ నుంచి గెంటివేసి చేయిచేసుకున్నారు,

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా రూపా గంగూలీ పోటీ చేస్తున్న హౌరా నియోజకవర్గం కూడా వుంది. ఈ క్రమంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఆమె ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు, గంగూలీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన రూపా... తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిని తోసేశారు. దీంతో అక్కడ కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు... పోలింగ్ బూత్ వద్ద ఘర్ణణకు కారణమై, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రూపాపై కేసు నమోదు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FIR  BJP candidate  Roopa Ganguly  scuffle  TMC worker  Howrah  

Other Articles