Vijay Mallya's passport revoked by external affairs ministry

External affairs ministry revokes vijay mallya s passport

Banks, Britain, Enforcement Directorate, India, Kingfisher, MEA, Ministry of External Affairs, Money laundering case, NewsTracker, passport, PMLA, Vijay Mallya

The Ministry of External Affairs (MEA) has revoked liquor baron Vijay Mallya's passport. MEA spokesperson Vikas Swarup on Sunday tweeted

పాస్ పోర్టు రద్దుతో మరింత ఇరుకునబడ్డ మాల్యా

Posted: 04/24/2016 04:19 PM IST
External affairs ministry revokes vijay mallya s passport

భారత దేశ ప్రజల ధనాన్ని రుణాలుగా తీసుకుని విలాసాలకు, వినోదాలకు ఖర్చుచేసి.. వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారవేత్త, బడా బిజినెస్ మన్ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. ప్రజల సోమ్మును ఎగొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా మారిన మాల్యాను భారత్ విదేశాంగ కూడా టార్గెట్ చేసింది. డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని ఆర్థిక నేరస్తుడిగా పరిగణించింది.

కాగా ఆయనపై ఎన్స్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినా.. తాను మాత్రం మరికోంత సమయం తరువాత హాజరవుతానంటూ ఈడీ అధికారులకు లేఖలు రాస్తున్నారు. మరోవైపు అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తన ప్రతిపాదనలు పెడుతూనే వున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు తన విదేశీ అస్తులతో ఎలాంటి పని లేదని కూడా ఆయన ఈడీ స్పష్టం చేసిన వివరాలపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు సరిగా సహకరించడం లేదన్న ఆయన పాస్ పోర్టు రద్దు చేశారు.

విజయ్ మాల్యా విచారణకు సహకరించని కారణంగా ఆయన పాస్ పోర్టు రద్దు చేస్తున్నట్టు ఆదివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సెక్షన్ 10(3)(సీ) అండ్(హెచ్) ఆఫ్ పాస్ పోర్ట్ ఆక్ట్ ప్రకారం విజయ్ మాల్యా పాస్ పోర్టు ను రద్దు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VijayMallya  passport  Non-bailable warrant  pass port revoke  

Other Articles