మార్చిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఇదే రోజు ఇంటర్ మొదటి ద్వితీయ సవంత్సర ఫలితాలు విడుదల చేశారు . తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎప్పుడు జరగనటివంటి విధంగా ఒకేసారి మొదటి ద్వితీయ ఏడాది పరీక్షా ఫలితాలను ఉదయం 11గంటలకి నాంపల్లి లోని బోర్డ్ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా 262,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివర తేదీగా ప్రకటించారు.
ఫలితాలను వెబ్సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు
ఫలితాల కోసం కింది లింక్స్ ను ఉపయోగించుకోవచ్చు .
http://tsbie.cgg.gov.in
www.results.educationandhra.com
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more