క్షమాపణలు చెప్పాల్సిందే రోజాకు సుప్రీంకోర్టు | Apologise to Assembly: SC to Roja

Apologise to assembly sc to roja

Roja, YSRCP, Nagari, Assembly, AP Assembly, రోజా, ఎమ్మెల్యే రోజా, సుప్రీంకోర్టు

The Supreme Court has directed YSRC MLA RK Roja, who had moved the Apex Court seeking justice against her suspension from the State Assembly for one year, to apologise to the House as well as to Speaker Kodela Sivaprasada Rao in order to get her suspension revoked. A Bench of the apex court consisting Justice Gopala Gowda and Justice Arun Mishra on Thursday asked Roja to say sorry to the State Assembly. The court further suggested the Assembly and the State government to accept the same, besides requesting the Speaker to close the matter.

క్షమాపణలు చెప్పాల్సిందే రోజాకు సుప్రీంకోర్టు

Posted: 04/22/2016 07:35 AM IST
Apologise to assembly sc to roja

నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా శాసనసభ పాటించడం లేదని రోజా వేసిన పిటిషన్ మీద సుప్రీం వెల్లడించింన తీర్పు రోజాకు షాకిచ్చింది. శాసనసభే సుప్రీం అని, దానికి సర్వాధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సభ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోబోమని, అదంతా స్పీకర్‌ పరిధిలోని అంశమని పేర్కొంది. సభా ధిక్కరణకు సంబంధించిన చర్యలను న్యాయ వ్యవస్థ పునఃసమీక్షించటం మంచిది కాదని వ్యాఖ్యానించింది. సమీక్ష వరకూ వెళ్లాలని తాము భావించటం లేదని తెలిపింది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వైసీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభకు క్షమాపణ చెప్పాలని, శుక్రవారంలోపు ఏక వాక్య క్షమాపణ లేఖను స్పీకర్‌కు పంపించాలని సూచించింది. ఆ లేఖను స్పీకర్‌ పరిగణలోకి తీసుకుని ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.

రోజా పాటిషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తులు మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య కాలంలో పార్లమెంటు, శాసనసభల పనితీరు ఆక్షేపణీయంగా ఉందని, తీవ్ర అవాంతరాలు కల్పించడం మంచిది కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు రాజనీతిజ్ఞుల్లా వ్యవహరించాలి. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఇటీవల అందుకు భిన్నంగా ఎన్నికల ప్రసంగాలు చేసినట్లు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రజా ప్రతినిధులు వ్యవహరించే తీరు ఇదేనా?’’ అంటూ తప్పుబట్టారు. మొత్తానికి హైకోర్టులో తనకు అనుకూలంగా వచ్చినట్లే సుప్రీం కోర్టులో కూడా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన రోజాకు ఎదురుదెబ్బ తగిలింది.

క్షమాపణ చెప్పిన రోజా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles