Imposition of Prez rule in Uttarakhand quashed by High Court

Stunning blow to centre uttarakhand hc sets aside prez rule

Article 356, BJP, Congress, floor test, Harish Rawat, Narendra Modi, Political suicide, PoliticsDecoder, Uttarakhand, Uttarakhand High Court

The resolution seeks to "deplore" the "destabilisation" of the democratically elected government in Uttarakhand and "disapprove" the "unjustified" imposition of president rule

కేంద్రానికి చెంపపెట్టు.. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన రద్దు..

Posted: 04/21/2016 09:34 PM IST
Stunning blow to centre uttarakhand hc sets aside prez rule

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధంపుపై గత మూడు రోజులుగా ఆ రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు తగులుతూనే వుండగా, ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం చెంపపెట్టు లాంటీ తీర్పును వెలువరించింది, ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్ పై గత మూడు రోజులుగా విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరు వర్గాల వారి వాదోపవాలను వినింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు గత మూడు రోజులుగా కేంద్రానికి మొట్టికాయలు వేస్తూనే వుంది, దీంతో ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయస్థానం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రద్దు చేసింది. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు.

ఈ కేసు తీర్పును వెలువరించే క్రమంలో ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలని పేర్కోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమేనని అభిప్రాయపడింది.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోందని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President rule  Uttarakhand High Court  union government  

Other Articles