సముద్రంలో నుంచి బుల్లెట్ ట్రైన్ | Mumbai-Ahmedabad bullet train to navigate 21 km tunnel under sea

Mumbai ahmedabad bullet train to navigate 21 km tunnel under sea

Bullet Train, Mumbai, Ahmedabad, Sea, tunnel under sea, బుల్లెట్ ట్రైన్, బుల్లెట్ రైలు, సముద్రం, ముంబై, అహ్మదాబాద్, ఇండియన్ రైల్వే

Passengers will get the thrill of riding under the sea while travelling between Mumbai and Ahmedabad in the first bullet train of the country. The 508 km long Mumbai-Ahmedabad high speed rail corridor will have a 21 km long tunnel under the sea, said a senior Railway Ministry official involved with the public transporter’s ambitious bullet train project.

సముద్రంలో నుంచి బుల్లెట్ ట్రైన్

Posted: 04/21/2016 06:14 AM IST
Mumbai ahmedabad bullet train to navigate 21 km tunnel under sea

ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. త్వరలో బుల్లెట్ ట్రైన్ భారత పట్టాలపై పరుగుపెట్టేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించనున్న ఈ రైలు 21 కిలోమీటర్లు మేరా సముద్రం కింద నుంచి ప్రయాణించనుంది. మంబై – అహ్మదాబాద్ ల మధ్య ఉన్న అరేబియా సముద్రం కింద ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. దీనికోసం ఓ భారీ టనెల్ ను ఏర్పాటు చేయనున్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలును ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రైలు ప్రయాణించే మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. అందులో 21 కిలోమీటర్లు సముద్రం క్రింది నుంచి ప్రయాణించనుంది. అందుకు ప్రధాన కారణం ధానే వద్ద ఓ పెద్ద సముద్ర చీలిక అడ్డురావడం. ఈ రైలు ఏర్పాటు కోసం మొత్తం 97,636 కోట్లు వెచ్చిస్తుండగా.. జపాన్ నుంచి 81శాతం భారత ప్రభుత్వం రుణంగా తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా.. 2018లో పనులు ప్రారంభం కానున్నాయి. 508 కిలోమీటర్లను గంటకు 300 కి.మీ వేగంతో కేవలం రెండు గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోనుందట ఈ బుల్లెట్ ట్రైన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles