Ecuador focused on finding survivors after deadly earthquake

Ecuador quake toll climbs over 400 damage put at billions of dollars

death toll, ecuador, earthquake, Ecuador Earthquake deaths, Walls of the prison, prisoners escape, Accident, quake toll raises to 431, japan quake deaths,

At least 431 people are now known to have died in the earthquake that struck Ecuador, the country's government says.

ITEMVIDEOS: అంతకంతకూ పెరుగుతున్న ఈ-క్వెడార్ భూకంప మృతుల సంఖ్య

Posted: 04/19/2016 02:06 PM IST
Ecuador quake toll climbs over 400 damage put at billions of dollars

ఈక్వెడార్ భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు అంతకంతకూ పెరుగుతుంది. భూకంపం సంభవించిన నాడు 72 మంది మృత్యువాత పడగా, తాజాగా ఆ సంఖ్య 431కి చేరింది.  మృతుల సంఖ్య మంగళవారానికి 431కు చేరిందని ఆ దేశ భద్రత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ భూకంప ధాటికి 2,068 మంది గాయపడ్డారని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. శిథిలాల  నుంచి క్షతగాత్రుల్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.

ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చిలీ, కొలంబియా, క్యూబా దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయని  వెల్లడించింది. కాగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని, శిథిలాల  నుంచి క్షతగాత్రుల్ని రక్షించేందుకు సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తోందని దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయా తెలిపారు. దేశంలోని పసిఫిక్ సముద్ర తీర ప్రాంత నగరాల్లో వందల  ఇళ్లు, హోటళ్లు నేలమట్టమయ్యాయి. రాజధాని నగరం క్విటో మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. భవనాలకు పగుళ్లు , కరెంట్ సరఫరా నిలిచిపోవడం తప్ప పెద్దగా నష్టం సంభవించలేదు.

దేశంలోని ఆయిల్ పరిశ్రమకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పోర్టోవీజోలో జైలు గోడలు కూలిపోవడంతో 100 మంది ఖైదీలు తప్పించుకున్నారు. బాగా దెబ్బతిన్న పోర్టోవీజోలో శిథిలాల నుంచి దుర్వాసన వస్తుండడంతో చిక్కుకున్న వారిని రక్షించే చర్యల్ని వేగవంతం చేశారు. బాగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో ప్రజల హక్కులు, స్వేచ్ఛ తాత్కాలికంగా రద్దయ్యాయి. పొరుగు దేశం కొలంబియాలోను కొంతమేర నష్టం జరిగింది.

శిథిలాల కింద చిక్కుకున్న తమవారిని రక్షించాలంటూ మాంటా నగరంలో పలువురు రోధిస్తూ కన్పించారు. శిథిలాల్ని తొలగిస్తూ కుటుంబసభ్యుల్ని రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరినీ కలచివేస్తున్నాయి. తన భర్త శిథిలాల కింద చిక్కుకున్నాడని, రక్షించాలంటూ వెరోనికా పాలాడినెస్ వాపోతూ చెప్పింది. తన శక్తి కొద్దీ శిథిలాల తొలగిస్తూ భర్త బయటకు వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. మాంటా నగరంలోని ఇలాంటి దృశ్యాలెన్నో చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ecuador Earthquake deaths  Walls of the prison  prisoners escape  Accident  

Other Articles