16-yr-old girl complains of rape by 113, including policemen, over 2 years

16 years old raped by 113 men over two years

gang rape, rape on minor, minor forced into prostitution, minor raped by 113 over 2 years, policemen raped minor girl, 16 year old girl raped, rape by 113 people, drugs, liquor, rape, gangrape, minor girl, pune, new delhi, model, west bengal, ramesh takula, tapendra sache, rohit bandari, harish shaha

A 16-year-old girl, who was brought here from West Bengal on the pretext of a job, has allegedly been tortured and forced into prostitution for the last two years.

మైనర్ బాలిక బలవంతపు వ్యభిచారం.. పోలీసులూ విటులే

Posted: 04/18/2016 06:27 PM IST
16 years old raped by 113 men over two years

రెక్కాడితే కానీ డోక్కాడని కుటంబానికి చెందిన ఓ 13 ఏళ్ల అబాగ్యురాలిని పని కల్పిస్తామని నమ్మబలికిన త్రాష్టులు అమెను బలవంతంగా వ్యభిచారం రోంపిలోకి దింపారు, ఆ బాలికను గత రెండేళ్లుగా 113 మందితో అత్యాచారం చేయించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే అమె వద్దకు వచ్చిన విటులలో చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లూ అదేనండీ పోలీసులు వున్నారు. కంచె చేను మేసిందన్న చందంగా పోలీసులు కూడా ముక్కుపచ్చలారని బాలికపై తమ కామవాంఛ తీర్చుకున్నారు.

పని కల్పిస్తామని చెప్పి పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి.. తనపై గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారంటూ 16 ఏళ్ల బాలిక వాపోతోంది. మహారాష్ట్రలోని పుణె నగరానికి తనను తీసుకొచ్చిన వ్యక్తులు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారని, అక్కడ కొందరు పోలీసులతో సహా 113 మంది తనపై అత్యాచారం చేశారని చెప్పింది. గత నెలలో అక్కడి నుంచి తప్పించుకుని ఢిల్లీ పారిపోయి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ కేసును తాజాగా పుణెకు బదిలీ చేసి, 113 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ కేసులో 26 ఏళ్ల మహిళతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో నేపాల్‌కు చెందిన స్వీకృతి ఖరేల్ (26), రోహిత్ భండారీ (35), హరీష్ షాహా (25), తపేంద్ర సచి (23), రమేష్ ఠకులా (25) ఉన్నారు. ఇటీవలే ఓ మోడల్‌ను ఢిల్లీ నుంచి పుణె తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అత్యాచారయత్నం చేసిన కేసుకు, ఈ పదహారేళ్ల బాలిక కేసుకు కూడా సంబంధం ఉంది. మోడల్ పూణే నుంచి పారిపోతూ బాలికను కూడా తప్పించి తీసుకెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ - నేపాల్ సరిహద్దులోని సిలిగురి ప్రాతానికి చెందిన బాలిక తల్లిని ఆమె తండ్రి వదిలేశాడు. దాంతో ఆమె మతిస్థిమితం కోల్పోయారు. వాళ్ల అమ్మమ్మకు టీ కొట్టు ఉండగా, అక్కడకు భండారీ తరచు వచ్చి సిగరెట్లు కొనుక్కునేవాడు. అప్పుడే ఈ బాలికను చూసి, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2014 జనవరిలో పుణె తీసుకెళ్లాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా, తర్వాత వ్యభిచారంలోకి దింపాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. డ్రగ్స్ ఇచ్చి, ఒకేసారి పలువురితో వ్యభిచారం చేయించేవాడని బాలిక తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  minor girl  pune  new delhi  model  west bengal  

Other Articles