Pratyusha suicide: Rahul Raj threatens to jump off hospital building

Pratyusha boy friend rahul raj threatens to jump off hospital building

Pratyusha Banerjee, Rahul Raj Singh, Dindoshi sessions court, anticipatory bail application, high-handed conspiracy, Banerjee’s father Shankar, police chargesheet, kamya punjabi, shashank vyas, saloni, palguni, vikas gupta, Pratyusha Banerjee death

Rahul Raj Singh, the boyfriend of deceased TV actor Pratyusha Banerjee, had locked himself in the bathroom and allegedly threatened to jump off the hospital building where he was undergoing treatment for depression, sources said.

ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకేస్తా.. నటి భాయ్ ఫ్రెండ్

Posted: 04/17/2016 09:13 AM IST
Pratyusha boy friend rahul raj threatens to jump off hospital building

చిన్నారి పెళ్లికూతరు టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్, ఆమె మృతికి పరోక్షంగా కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న రాహుల్ రాజ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స పొందుతున్న ఆస్పత్రి భవనం బాత్ రూంలోకి చొరబడి అందులోని కిటికీలో నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. వాష్ రూమ్ కు వెళ్లిన రాహుల్ ఎంతకీ తిరిగిరాక పోవడంలో రాహుల్ బంధువులు డాక్టర్లను వేడుకోగా, వారు వెళ్లి రాహుల్ ను మాటలతో భుజ్జగించడంతో కొద్దిసేపటి తరువాత ఆయన కిందకు దిగివచ్చారు.

ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అతడు ఈ నెల 3 నుంచి శ్రీ సాయి ఆస్పత్రిలో చేరి మానసిక ఒత్తిడికి చికిత్స పొందుతున్నాడు. అయితే, అతడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి కనీసం రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాహుల్ .. బాత్ రూంలోకి చొరబడి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. తాను కిందికి దూకి చనిపోతానని బెదిరించడంతో చివరకు వైద్యులు అతడితో ఏదో ఒకలా మాట్లాడి బయటకు రప్పించారు. ఆ తర్వాత కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు.

కాగా రాహుల్ రాజ్ సింగ్ మానసిక ఒత్తిడితో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని వైద్యులు అరోపిస్తున్నా.. ఆయన తండ్రి సుధాకర్ మాత్రం ఈ అరోపణలను తోసిపుచ్చుతున్నారు. తన కొడుకుపై పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుందని, వైద్యులు ఆయను మానసిక ఒత్తిడికి లోను చేసే విధంగా వైద్యం చేస్తున్నారని ఆయన అరోపించారు. ఈ మేరకు ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు అప్పీలు చేస్తూ లేఖను రాశారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతాయని అరోపించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratyusha Banerjee  Rahul Raj Singh  suicide attempt  hospital  threatens to jump  

Other Articles