director puri jagannadh files complaint against blackmailing distributors

Distributors create ruckus at puri s office

distributors create ruckus at Puri's office, puri jagannadh telugu movie, puri jagannadh latest updates, puri jagannadh news, puri jagannadh, loafer, distributors, puri jagannadh policce complaint, puri jagannadh direction, puri jagannadh jubilee hills police

Puri Jagannadh approached the police and filed a case against three distributors Abhishek, Mutyala Ramadasu and Sudheer.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పై దాడి.. పరారీలో నిందితులు

Posted: 04/16/2016 07:53 PM IST
Distributors create ruckus at puri s office

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. చిత్ర సీమకు సంబంధించన డిస్ట్రిబ్యూటర్లు దర్శకుడు పూరీ జగన్నాథ్ పై దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది, ఈ ఘటనపై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సి.కల్యాణ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల ‘లోఫర్’ సినిమా రూపొందించారు.

ఈ సినిమా నైజాం, సీడెడ్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ అనే డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టాలు రావడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురూ గత కొద్ది రోజుల నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని తనకేం సంబంధం లేదంటూ పూరీ బదులు చెప్పినా వీరు వినిపించుకోలేదు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -34లో ఉన్న పూరీ జగన్నాథ్ కార్యాలయానికి వచ్చిన అభిషేక్, సుధీర్, ముత్యాలరాందాస్ లు డబ్బులు ఇవ్వాలంటూ పూరీని బెదిరించారు. ఆ క్రమంలోనే పూరీపై దాడి కూడా చేసినట్లు తెలిసింది. దర్శకుడి కుటుంబ సభ్యులను సైతం నిందితులు భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దౌర్జన్యానికి పాల్పడ్డ ముగ్గురిని ఆపేందుకు పూరీ యత్నించినా ఫలితం లేకుండాపోయింది.

కాగా, తన కార్యాలయంపై డిస్ట్రిబ్యూటర్లు దాడిచేశారంటూ పూరీ జగన్నాథ్ శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్‌విత్ 511 కింద కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే చిత్ర దర్శకత్వానికి దర్శకులు కోట్ల రూపాయల మేర డబ్బును తీసుకోవడం కూడా దాడులకు దారి తీస్తుందని సమాచారం, కాగా, సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా తమకు సంబంధం లేదని, అయితే తమ బాద్యతను మాత్రం తాము తప్పక నిర్వహిస్తామని, ఏ దర్శకుడు తన చిత్రం ప్లాప్ కావాలని కోరుకోరని సినీ వర్గాలు పేర్కోంటున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : directio puri jagannath  distributers  case filed  jubilee hills police station  

Other Articles