cricketer nayeem Qadir butt gunned down in jammu and kashmir

Police gunned down top cricketer nayeem qadir butt

Curfew in Kashmir, curfew in jk, curfew in handwara area, girl molested in kashmir, cricketer nayeem Qadir butt, mohammad iqbal, raja begum

Mohammad Iqbal and Nayeem Qadir Butt, and an aged woman, Raja Begum, were killed when the troops opened indiscriminate fire on the people who were protesting against the molestation of a girl by the troops in Handwara area of the district.

పోలీసుల కాల్పులు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మృతి..

Posted: 04/16/2016 12:55 PM IST
Police gunned down top cricketer nayeem qadir butt

యువతిపై అత్యాచారం జరిగిందన్న వదంతులలో అట్టుడుకుతున్న జమ్ముకాశ్మీర్ హంద్వారాలలో గత నాలుగు రోజులగా కొనసాగుతుంది. అయితే ఈ అందోళనలు చెలరేడగంతో నిన్న జరిగిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నయీమ్ భట్ చనిపోయాడు. ఓ పాఠశాల విద్యార్ధినిపై ఓ సైనికుడు అత్యాచారం చేశాడనే పుకార్లు రావడంతో స్థానిక యువకులు ఆర్మీ పోస్ట్‌పైకి రాళ్లు రువ్వారు. సాయుధ దళాలకు వ్యతిరేకంగా అందోళనలు చేపట్టారు.

తనపై ఎవ్వరూ అత్యాచారం చేయలేదని స్వయంగా ఆ బాలిక మీడియా ముందుకు వచ్చి పుకార్లకు అడ్డుకట్ట వేసేలోగానే ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సైన్యం గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న నయీమ్ భట్ ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు యత్నించాడు. అందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల చివరాఖరి చర్యగా జరిపిన కాల్పుల్లో పొరపాటున బుల్లెట్లు తగిలి ఇద్దరు చనిపోయారు.

వీరిలో నయీమ్ భట్ కూడా ఉన్నాడు. నయీమ్ కాశ్మీర్ జింఖానా క్లబ్ తరపున టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఇప్పటికే పలు ట్రోఫీల్లో మ్యాన్ ఆఫ్ ద సీరీస్‌గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా ఇప్పటికే అందుకున్నాడు. ఐదేళ్లుగా తమ క్లబ్ తరపున ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్న నయీమ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని క్లబ్ కెప్టెన్ మన్సూర్ చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా నుంచి జాతీయ స్థాయిలో అండర్ 19‌కు మూడేళ్ల క్రితమే ఎంపికయ్యాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles