Bihar CM Nitish Kumar attacks BJP, RSS; refers to Rohith Vemula, Kanhaiya Kumar incident

Bjp mocks constitution and celebrates ambedkar s birth anniversary says nitish kumar

BJP, Nitish Kumar, Constitution, BR Ambedkar, birth anniversary, Narendra Modi, Bihar. constitution, Rohith Vemula, Hyderabad central university

JD(U) President and Bihar Chief Minister Nitish Kumar today launched a blistering attack against BJP and RSS, saying they were chanting the name of Dalit icon B R Ambedkar but behaving in a manner opposite to the values promoted by him.

రాజ్యాంగాన్ని పరిహసిస్తూ.. అంబేద్కర్ జయంతి వేడుకలా..?

Posted: 04/14/2016 08:04 PM IST
Bjp mocks constitution and celebrates ambedkar s birth anniversary says nitish kumar

భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూనే.. మరోవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను తామే ఘనంగా నిర్వహిస్తున్నామని కొందరు బడాయిలకు పోతున్నారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని  మండి పడ్డారు. అంబేద్కర్ జయంతుల ద్వార దళితులను తమ వైపు తిప్పుకోవాలని కేంద్రం యత్నిస్తుందని విమర్శించారు.

పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారు అంబేద్కర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. బలహీనవర్గాల వారి ఓట్లు దండుకోవడానికే అంబేద్కర్  పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి వెలుతోందని.. వారికి బాబాసాహెబ్ సిద్ధాంతం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. ఓట్ల కోసం నటించే నాయకులను ఎంత మాత్రం విశ్వసించరాదని నితీష్ కుమార్ పిలుపునిచ్చారు.

అంబేద్కర్ సమాజంలోని అసమానతలను  రూపుమాపడానికి  పోరాటం చేశాడని, బీజేపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విడదీయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు వేధించబడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వారిని పట్టించుకోకుండా దళితుల ఓట్లకోసం వారి పట్ల ప్రేమను నటిస్తున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్లు జాతీయవాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Narendra Modi  Bihar. B R Ambedkar. BJP  constitution  

Other Articles