Veenu Paliwal | Passes Away | Woman Biker | Lady of the Harley

Woman biker veenu paliwal died

Veenu Paliwal Died, Veenu Paliwal Death, Veenu Paliwal Passes away, Veenu Paliwal passed away, Veenu Paliwal stills, Veenu Paliwal, Harley Veenu Paliwal died, Veenu Paliwal liver injury

Woman Biker Veenu Paliwal Died: Lady of the Harley Veenu Paliwal, 44, was on a nationwide tour on her Harley Davidson when the accident. Harley Veenu Paliwal died of liver injury.

లేడీ ఆఫ్ హార్లీ కన్నుమూత

Posted: 04/13/2016 12:16 PM IST
Woman biker veenu paliwal died

ప్రముఖ మహిళ బైకర్ వీనూ పాలీవాల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్టైలిష్ బైక్ రైడర్ గా ‘లేడీ ఆఫ్ హార్లీ’ గా, హాగ్‌ (హార్లీ ఓనర్స్‌ గ్రూప్‌) రాణిగా పేరొందిన వీనూ పాలీవాల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీనూ పాలీవాల్ ఇటీవలే హోలీ కార్యక్రమం అనంతరం మరో బైకర్ దీపేష్ తన్వర్ తో కలిసి జైపూర్ నుంచి బైక్ పై కశ్మీర్ నుంచి కన్యాకుమారి యాత్రకు బయల్దేరింది. కానీ ఆమె మధ్యప్రదేశ్ లో దుర్మరణం చెందారు.

సోమవారం ఉదయం లఖ్నవ్ నుంచి హార్లీ, దీపేష్ లు భోపాల్ కు బైక్ లపై బయల్దేరారు. అయితే మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా గ్యార్సపూర్ ప్రాంతంలో వీనూ పాలీవాల్ నడుపుతున్న బైక్ స్కిడ్ అవడంతో, వేగం అదుపుతప్పి.. కిందపడి తీవ్ర గాయాలపాలయ్యింది. దీంతో వెంటనే ఆమెను దీపేష్ సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం... వీనూ పాలీవాల్ ను విదిశ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ.. వీనూ పాలీవాల్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ రోడ్డు ప్రమాదంలో వీనే కాలేయం బాగా దెబ్బతినడం వల్ల ఆమె మరణించినట్లుగా పోస్ట్ మార్టంలో తేలింది. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని జైపూర్ లోని ఆమె స్వస్థలానికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veenu Paliwal  Passes away  Woman Biker  Accident  Injured  stills  

Other Articles