'Come to Maharashtra, I will put a knife to your throat' says Raj Thackeray

Brath mataki jai row raj thackeray dares asaduddin owaisi

Brath mataki jai chant, MNS, Raj Thackeray, AIMIM, Asaduddin Owaisi, knife to throat, shiv sena, prime minister modi, pm modi, narendra modi

Come to Maharashtra, I will put a knife to your throat’ maharastra nava nirmana samithi president Raj Thackeray, threatens Asaduddin Owaisi over Bharat Mata Ki Jai row!

మహారాష్ట్రకు వస్తే నీ గొంతుపైన కత్తి నేనే పెడతా..

Posted: 04/09/2016 04:27 PM IST
Brath mataki jai row raj thackeray dares asaduddin owaisi

'భారత్ మాతాకీ జై' నినాదంపై చెలరేగుతున్న వివాదానికి మరింత ఆజ్యంపోశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే. 'మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తిపెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. 'భారత మాతాకీ జై' అని ఎందుకు అనవో చూస్తా' అంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఒవైసీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కన్నపెంచిన తల్లి కన్నా కడవరకు మోస్తున్న జన్మభూమిని పొగిడేందుకు ఎందుకు అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు.

ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో జరిగిన ఓ సభలో మాట్టాడిన రాజ్ థాక్రే ఎంఐఎం, సహా అటు బీజేపీ ఇటు శివసేనలపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించారు. అధికార బీజేపీ కరువు పరిస్థితులపై పట్టనట్లు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు, బీజేపి మిత్రపక్షంగా ఉన్న శివసేన వెంటనే మహారష్ట్ర లోని అధికార బీజేపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని రాజ్ థాక్రే డిమాండ్ చేశారు.

దేశభక్తి విషయంలో ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలను పట్టించుకోనని, మెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై నినాదం చేయబోనని అసదుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 'చట్టాలను గౌరవించబట్టే  భారత్ మాతాకీ జై అననన్న లక్షల మందిని ఊచకోత కోయట్లేదు'అని యోగా గురు రామ్ దేవ్ అన్నారు. ఇప్పుడు అసద్ ను విమర్శించిన వంతు రాజ్ థాక్రేది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh