At Arichal Munai, sand dunes turn into Small islands in sea

Lord rama stepped sand dunes turn into island at rameshwaram

Dhanuskodi, Ram Sethu, Arichal munai, rameshwaram, bay of bengal, indian ocean, lord sri ram, sethu bridge, Adam’s Bridge, limestone shoals, South most tip of the Rameswaram Island

Sethu – Bridge, The sea bridge built across the sea towards srilanka by Lord Rama is believed to be started from here.

శ్రీరాముడు తిరుయాడిన సముద్రతీరం.. దీవులుగా మారుతున్న దిబ్బలు..

Posted: 04/07/2016 04:33 PM IST
Lord rama stepped sand dunes turn into island at rameshwaram

రామేశ్వరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి అరిచల్‌మునై తీరంలో కడలి ప్రవాహవేగం అధికమవుతుండటంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇసుక దిబ్బలు చిన్న చిన్న దీవుల్లా మారుతున్నాయి. అరిచల్‌మునై సముద్రతీరానికి, శ్రీలంక తీరానికి మధ్యన సముద్రంలో ఇంచుమించు చిన్న చిన్న దీవుల్లా 13 ఇసుక దిబ్బలున్నాయి. ధనుష్కోటి తీరంలోని ఆ ఇసుకదిబ్బలు పగలు మాత్రమే కనిపిస్తాయి. రాత్రిపూట సముద్రపు నీటిలో మునిగిపోతుంటాయి. అరిచల్‌మునై వద్ద బంగళాఖాతంలో హిందూమహాసముద్రం సంగమిస్తుం ది. రామేశ్వరానికి వచ్చే భక్తులు, పర్యాటకులు రోజూ అరిచల్‌మునైకి చేరుకుని స్నానమాచరిస్తారు. రెండు సముద్రాలు కలిసే చోట ఇసుకదిబ్బలను ఆసక్తిగా తిలకిస్తుంటారు.
 
ఇక ధనుష్కోటి తీరంలో గత కొద్ది రోజులుగా సముద్రజలాల ప్రవాహవేగం, గాలి వేగంలో మార్పులు చోటచేసుకుంటున్నాయి. రెండు రోజుల ముందు సముద్ర ప్రవాహంలో వచ్చిన మార్పుల కారణంగా అరిచల్‌మునైలోని మొదటి ఇసుకదిబ్బ ప్రాంతం రెండుగా చీలిపోయింది. ఆ చీలిన ప్రాంతంలో సముద్ర జలాలు వేగంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకులు సముద్ర సంగమ ప్రాంతాన్ని ఆనందంగా తిలకిస్తున్నారు. రామేశ్వరం ఆలయానికి వెళ్లిన భక్తులు దనుష్కోటికి వెళ్లి ఈ అరుదైన దృష్యాన్ని సాక్ష్యంగా నిలుస్తున్నారు.

ధనుష్కోటి తీరానికి ఐదేళ్లుగా జీపు నడుపుతున్న డ్రైవర్‌ మురుగేశన మాట్లాడుతూ ధనుష్కోటి అరిచల్‌మునై మొదటి ఇసుకదిబ్బను ఇప్పటిదాకా దూరం నుండే చూసేవారమనీ, ప్రస్తుతం సముద్ర ప్రవాహంలో వచ్చిన మార్పు కారణంగా ఆ ఇసుకదిబ్బపైకి వెళ్లి రెండు సముద్రాల సంగమ ప్రాంతాన్ని చూడటానికి వీలుపడిందనీ చెప్పారు. ప్రస్తుతం అరిచల్‌మునైలో మినీ దీవిగా మారిన మొదటి ఇసుక దిబ్బ ప్రాంతాన్ని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యంలో తరలివస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Dhanuskodi  Ram Sethu  Arichal munai  rameshwaram  bay of bengal  indian ocean  lord sri ram  sethu bridge  

Other Articles