Pratyusha Banerjee | suicide case | Rahul Raj Singh | police chargesheet | rahul bail plea | anticipatory bail

Pratyusha banerjee death case rahul raj singh anticipatory bail plea rejected

Pratyusha Banerjee, Rahul Raj Singh, Dindoshi sessions court, anticipatory bail application, police chargesheet, kamya punjabi, shashank vyas, saloni, palguni, vikas gupta, Pratyusha Banerjee death

Actor-producer Rahul Raj Singh anticipatory bail application was rejected by the Dindoshi sessions court on Thursday.

నటి ప్రత్యూష బెనర్జీది ఆత్మహత్య కాదా..? హత్యేనా..?

Posted: 04/07/2016 02:09 PM IST
Pratyusha banerjee death case rahul raj singh anticipatory bail plea rejected

ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీది ఆత్మహత్య కాదా..? అమెది హత్యేనా..? అమెను హత్య చేసింది ఎవరు..? ప్రత్యూష సహచర నటీనటులు, సన్నిహతులు, కుటుంబసభ్యులు అరోపిస్తున్నట్లు రాహుల్ రాజ్ సింగ్ అమెను హత్య చేశాడా..? ఈ అభియోగాల్లో నిజమెంత..? అబద్దమెంత..? అంటే చెప్పలేం. కానీ ప్రత్యూష ఆత్మహత్యకేసులో అమె కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది మాత్రం ఇదే విషయాన్ని న్యాయస్థానంలో వినిపించారు. ప్రత్యూషది అత్మహత్యకాదని, హత్యగా కూడా మారవచ్చని పేర్కోన్నాడు,

ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో ప్రత్యూష బెనర్జీని హతమార్చినట్లుగాఅభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ముంబై కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాహుల్‌ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ప్రత్యూష కుటుంబం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ప్రత్యూష కేసు హత్యకేసు అయ్యే అవకాశముందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని జడ్జికి విజ్ఞప్తి చేశారు. దీంతో బెయిల్ ఇవ్వడం లేదంటూ జడ్జి కేఎఫ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు.

బెయిల్‌ కోసం ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ప్రత్యూషది నూటికి నూరుపాళ్లు హత్యేనని, ఈ కేసులో రాహుల్‌ను తీవ్రంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినట్టు రాహుల్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక రాహుల్‌ గతంలో కూడా పలువురు మహిళలను మోసం చేసినట్టు తెలుస్తోంది. అతడు తమను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని టీవీ పరిశ్రమకు చెందిన హీర్ పటేల్‌, కేశా కంభాటితోపాటు మరో మహిళ ఆరోపించారు. రాహుల్ వలలో చిక్కి మోసపోయిన మహిళలు డజను వరకు ఉంటారని వారు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles