Kiwi dads speak out from Mexico - and show off their three little surrogate babies

Newborn triplings at the centre of an international legal storm

newborn triplings, Lachlan, Kelly, Blake, newborns, international legal storm, surrogate mums, Mexico, Auckland parents, David and Nicky Beard, Argentinian egg donor, beard couple, last gay couple, international surrogates, Mexico tightens IVF laws, International surrogacy, homosexual couples, Paula Attrill, New Zealand government

The "triplings" were born to surrogate mums in Mexico, in an arrangement with their Auckland parents, David and Nicky Beard, and an Argentinian egg donor.

ఇది ఆన్‌లైన్‌ మోసమేనా..? వాళ్లపై మండిపడుతున్న నెట్ జనులు

Posted: 04/06/2016 01:57 PM IST
Newborn triplings at the centre of an international legal storm

ప్రస్తుత పరిస్థితుల్లో ఏది మోసమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఫొటోలు పెడుతున్నారు. ఏవేవో కబుర్లు చెబుతున్నారు. ‘‘కష్టాల్లో ఉన్నాం కాపాడండి’’ అంటున్నారు. మంచి మనసు ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రకటనలను నమ్మి చెమటోడ్చి సంపాదించిన సొమ్మును దానం చేస్తున్నారు. మోసగాళ్ళకు బలైపోతున్నారు. అయితే వాళ్లు మోసగాళ్లని తెలియగానే ఛ మోసపోయాం అంటూ రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు నిజంగా అవసరంలో వున్నవాళ్లు ఇలా అడిగితే సాయం చేయడానికి కూడా ముందుకు రాలేం కదా అంటూ మోసగాళ్లపై నెటిజన్ల మండిపడుతున్నారు.
 
న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్, నిక్కీ బియర్డ్ గే జంట మెక్సికోలో ఇద్దరు సరోగేట్ తల్లుల ద్వారా ముగ్గురు పిల్లల్ని పొందారు. ఆ పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్ళడానికి మెక్సికో వెళ్ళారు. అక్కడికెళ్ళేసరికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయట! బియర్డ్ జంటకు గ్రేస్ నిక్సన్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆయన వీళ్ళకోసం ‘గివ్ ఏ లిటిల్’ అనే వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశాడు. మానవత్వం ఉన్నవాళ్ళంతా సాయం చేయాలని కోరారు. తమ బిడ్డలు బొద్దింకల మధ్య ఉన్నారని, నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డకు, మరో ఇద్దరు బిడ్డలకు వైద్యానికి భారీగా ఖర్చు చేశామని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. తమ బిడ్డలను న్యూజిలాండ్‌లోని తమ ఇంటికి తీసుకెళ్ళడానికి విరాళాలు ఇవ్వాలని కోరారు.
 
వీళ్ళ ఆశ నెరవేరింది. దాదాపు 700 మంది దాతలు స్పందించి, 25 వేల డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు బియర్డ్స్ జంట అబద్ధాలు చెబుతున్నారని స్వయంగా వారి తరపున పని చేస్తున్న న్యాయవాది చెబుతున్నారు. వారు కొన్ని అఫిడవిట్లపై సంతకాలు చేయవలసి ఉందని, దత్తత కోసం అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. కానీ వాళ్ళు ఇక్కడ చిక్కుకోలేదని తెలిపారు. బర్త్ సర్టిఫికేట్లు కూడా జారీ అయ్యాయన్నారు. మెక్సికోకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ కూడా ఆ బిడ్డలకు మంజూరైందన్నారు. బియర్డ్ జంటతో పాటు హోటల్‌లో బస చేసిన మరో సరోగసీ తండ్రి కూడా వీరి ఆరోపణలను ఖండించారు. వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇవన్నీ తెలుసుకున్న నెటిజన్లు వీళ్లపై మండిపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles