Pratyusha Banerjee suicide case | Hema malini | senseless suicides | Vikas Gupta | Kamya Punjabi | Ada Khan |

Hema malini calls pratyusha s alleged suicide senseless

Pratyusha Banerjee, Rahul Raj Singh, Hema Malini, kamya punjabi, shashank vyas, saloni, palguni, vikas gupta, Pratyusha Banerjee death, Friends, shocking details, Asphyxia, Post mortem, Balika Vadhu, Pratyusha Banerjee suicide, actress, balika vadhu, tragedy, love life, relationship, marriage

Ever since actor-politician Hema Malini has tweeted about the TV actress Pratyusha Banerjee’s death, she has been criticised for her tweets on what she calls “senseless suicides”.

ప్రత్యూష ఆత్మహత్యపై నోరుజారిన బీజేపి ఎంపి.. మండిపడుతున్న నెట్ జనులు

Posted: 04/05/2016 08:34 PM IST
Hema malini calls pratyusha s alleged suicide senseless

ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య యావత్ దేశంలోని కళాకారులందరినీ కదిలించి వేసింది. అమె అత్మహత్య చేసుకునేంత పిరికిదికాదని, అయితే రాహుల్ రాజ్ సింగ్ వేధింపుల కారణంగానే అమె అత్మహత్యకు పాల్పడి వుండవచ్చని వాదనలు అమె స్నేహితులు వ్యక్తం చేస్తున్న తరుణంలో బాలీవుడ్ అలనాటి కథనాయిక, బీజేపి ఎంపీ హేమామాలి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ప్రత్యూష బెనర్జి ఆత్మహత్య అమెను చికాకు పరిచినట్టు ఉంది. ఆమె ఆత్మహత్య మూర్ఖమైనదని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే ఇలాంటి ధోరణి ఎంతమాత్రం సబబు కాదంటూ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు ఆమె ట్విట్టర్లో చేసింది.

'అన్ని మూర్ఖమైన ఆత్మహత్యలే. వాటివల్ల ఏమీ జరుగదు. జీవితం దేవుడు ఇచ్చిన కానుక. అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ప్రాణాలు తీసుకొనే హక్కు మనకు లేదు' అని హేమామాలిని పేర్కొంది. 'కష్టాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేకానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోకూడదు. ప్రపంచం పోరాడేవారినే కీర్తిస్తుంది. కానీ పరాజితులను కాదు' అని తెలిపింది. 'సెలబ్రిటీ ఆత్మహత్యలు ఆకలిగొన్న మీడియాకు ఆహారంలాంటింది. మరో సెన్సేషనల్ వార్త వచ్చేవారకు దానిని ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత మరిచిపోతుంది' అని హేమ పేర్కొంది.

అయితే కొన్నిసార్లు జీవించడం కూడా అత్యంత క్లిష్టతరమవుతుందని, ఇలా మరణించిన వారిపట్ల హేమమాలిని కఠినంగా వ్యాఖ్యానించడం ఆమె స్థాయికి తగదని రీ ట్వీట్లు వస్తున్నాయి. ఇవి కాఠిన్యంతో కూడిన వ్యాఖ్యలని, హేమమాలిని మనసు సున్నితంగా లేదని నెటిజన్లు అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకదన్నది నిజమే అయినా, సమాజంలో మంచి గుర్తింపున్న వారు ఇలాంటి మాటలను చెప్పడం గొప్పనిపించుకోదని మరికొందరు హితవు పలికారు.

కాగా  ప్రత్యూష బెన‌ర్జీ ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకోవ‌డానికిగ‌ల కార‌ణాల‌పై దర్యాప్తు చేసిన పోలీసులు అమె ఆత్మహత్య కేసులోఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ప్రయిుడు రాహుల్ ప్రత్యూష ఆత్మహత్యకు కారణమని అమెను ఆత్మహత్యదిశగా ప్రేరేపించాడని పోలీసులు కేసు నమోదు చేశారు, ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ రాజ్‌సింగ్ వ‌ల్ల ఆమె సమస్యలు ఎదుర్కొంద‌ని అందువల్లే అమె గత్యంతరం లేని పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కెన్నట్లు తెలుస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratyusha Banerjee  Rahul Raj Singh  Pratyusha Banerjee suicide  Hema Malini  Bollywood  

Other Articles