Coal scam: JIPL directors Rungtas get 4 years jail, to pay Rs 5 lakh fine each

Coal scam case rungtas get 4 years in jail jipl fined rs 25 lakh

Jharkhand Ispat Pvt Ltd (JIPL), R C Rungta, coal scam, coal block allocation, coal block allocation case, coal scam, r c rungta, r s rungta, jipl directors coal scam, r c rungta coal scam, r s rungta coal scam, jipl directors r c rungta r s rungta jailed, coal scam news, coal scam latest news, rungra brothers, jharkhand ispat, court, directors, sentenced, R S Rungta, Bharat Parashar

Directors of Jharkhand Ispat Pvt Ltd (JIPL), R C Rungta and R S Rungta, were on Monday jailed for four years in a coal scam case by a special court.

బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు.. ఇద్దరు డైరెక్టర్లకు శిక్ష విధింపు

Posted: 04/04/2016 07:52 PM IST
Coal scam case rungtas get 4 years in jail jipl fined rs 25 lakh

బొగ్గు కుంభకోణంలో కేసులో సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తొలి తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు డైరెక్టర్లకు శిక్షను విధిస్తూ తీర్పును చెప్పిన కోర్టు.. మరో పక్క వారికి చెరో ఐదు లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది, వారితో పాటు బొగ్గుకుంభకోణంతో లాభాలను గడించిన సంస్థకు కూడా 25 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించింది. నకిలీ ధృవ పత్రాలు సమర్పించి బొగ్గు గనులు దక్కించుకున్న జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్  కు చెందిన ఇద్దరు డైరెక్టర్లకు  శిక్షలను ఖరారు చేస్తూ సీబీఐ  జడ్జ్ భరత్ పరాశర్  తీర్పును వెలువరించారు.   

కోల్ మైనింగ్ అనుమతి కోసం జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్  డైరెక్టర్లు ఆర్‌ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తా లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసగించారన్న ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో వారికి  కోర్టు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు ,రూ .5 లక్షల జరిమానా  విధిస్తూ తీర్పు చెప్పింది.  దీంతో పాటుగా కంపెనీ  25  లక్షల  రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా  ఆదేశించింది.  

గత నెలలు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో  పేర్కొన్నారు. ఇద్దరిని దోషులుగా నిర్దారించిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని గత వారం పోలీసు అధికారులను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇరువురు ఇస్సాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నేర పూరిత కుట్ర, మోసానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది.. గత యేడాది మార్చి 21న వివిధ సెక్షన్ల కింద సీబీఐ అధికారులు వీరిపై కేసు నమోదు చేయగా కోర్టు విచారణ జరిపి ఇవాళ తీర్పు వెలువరించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coal scam  rungra brothers  jharkhand ispat  court  directors  sentenced  

Other Articles