Angry rhino chases terrified man up tree to protect baby

Ranger scramble up tree as furious mummy rhino chases to protect baby

mummy rhino, furious rhino, rhino chased a terrified park ranger, rhino protect its calf, video footage, elephant trainer, aggressive rhino butt its head at ranger, Rhinoceros, park ranger, Kaziranga National Park, Assam

Don't mess with a mummy rhino! Ranger is forced to scramble up a tree after furious rhinoceros decides he has got too close to her calf

ఆది అనుభవం కాదు.. చావును దగ్గరనుంచి చూడటమే..

Posted: 04/02/2016 12:34 PM IST
Ranger scramble up tree as furious mummy rhino chases to protect baby

ప్రస్తుతం భూమి మీద ప్రాణాలతో ఉన్న ఖడ్గమృగాల్లో మూడింట రెండొంతులు నివసించేది అక్కడే. అత్యధికంగా ఖడ్గమృగాలు హత్యకు గురవుతున్నది కూడా అక్కడే. అది ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. ఇంకా ఎన్నో విశిష్టతలున్న ఆ చోటు అసోంలోని కజిరంగా జాతీయపార్కు. అరుదైన ఖడ్గమృగాలు, పక్షిజాతులకు నివాసస్థావరం. గడిచిన కొద్దికాలంగా పేట్రేగిపోతోన్న స్మగ్లర్ల బారి నుంచి జంతువులను కాపాడేందుకు సుశిక్షితులైన రేంజర్లను నియమించారు పార్కు అధికారులు. అలా నియమితుడైన ఓ రేంజర్ కు అరుదైన ఘటనను ఎదుర్కోన్నాడు. రమారమి చావు అంచులదాకా వెళ్లాడు. కానీ అదృష్టం బాగుండటంతో బతికి బట్టకట్టాడు

వాహనాలు వినియోగిస్తే స్మగ్లర్లు పారిపోయే అవకాశం ఉంటుందిని కేవలం కాలినడకన పార్కులో కలియదిరగడం రేంజర్ల విధి. అలా ఓ మావటి (ఏనుగు శిక్షకుడు) రేంజర్ గా తన విధులు నిర్వహిస్తుండగా .. ఓ భారీ ఖడ్గమృగం కంటబడ్డాడు. పైగా అది పిల్ల తల్లి కూడా. సహజంగానే పిల్లతల్లులైన జంతువులు మిగతా సమయాల్లోకంటే ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రేంజర్ ను చూసిన ఖడ్గమృగం, అతను ఎక్కడ తన పిల్లకు, తనకు హాని చేస్తాడేమోనని కంగారుపడింది. ఆ కంగారు కాస్తా కోపంగామారి రేంజర్ వైపు గుర్రుగా దూసుకొచ్చింది. దిక్కుతోచని రేంజర్ పక్కనే ఉన్న చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.

నిజానికి ఆ చెట్టును కూల్చేసి, అతణ్ని చంపడం ఖడ్గమృగానికి పెద్ద పనేంకాదు. కానీ దాని లక్ష్యం పిల్లల్ని కాపాడుకోవటమేకాబట్టి దారి దొరకగానే పిల్లతోసహా తన దారినతాను వెళ్లిపోయింది. అదే పార్కులో తిరుగాడుతోన్న కౌషల్ బొరువా అనే జంతుశాస్త్రవేత్త ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డతర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉందని ఆ రేంజర్ ను అడిగితే.. అది అనుభవం కాదు చావును దెగ్గర నుంచి చూసినట్లే అయ్యిందని బదులిచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rhinoceros  park ranger  Kaziranga National Park  Assam  

Other Articles