Dangil selfie video to reena

Dangil selfie video to reena

Dangil, Reena, Techie Suicide, Hyderabad

Dangil selfie video goes viral in social media to Reen who suicided two days back in Hyderabad. In that video Dangil requested to Reena to continue their relation

ITEMVIDEOS: రీనా లవర్ డేంజిల్ సెల్ఫీ వీడియోలొ ఏముంది..?

Posted: 03/31/2016 01:37 PM IST
Dangil selfie video to reena

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రీనా సూసైడ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రీనాను ప్రాణానికంటే మిన్నగా ప్రేమించానని చెప్తున్న డెంజిల్‌ ఆమె ఆత్మహత్యకు మాత్రం తను కారణం కాదని వాదిస్తున్నాడు.  మల్కాజ్‌గిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ రీనా సూసైడ్‌ మిస్టరీ మలుపులు తిరుగుతోంది. నా ప్రియుడు డెంజిల్ నమ్మించి మోసం చేసినందుకే సూసైడ్‌ చేసుకుంటున్నానంటూ లెటర్‌ రాసి రీనా బలవన్మరణానికి పాల్పడింది.అయితే తాజాగా రీనా ప్రియుడు ఆమె కొసం పంపించిన ఓ సెల్పీ వీడియో సంచలనం రేపింది.ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారని, అంతా మంచి జరుగుతుందని ఆ వీడియో అతడు అన్నాడు. అయితే పాతవన్నీ మరిచిపోయి మళ్లీ ముందులాగా ఉందామని డెంజిల్ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు. 

తప్పు రీనా చేసినా నేనే క్షమాపణ చెప్పాలన్న మనస్తత్వం రీనాది అంటూ డెంజిల్‌ ఆరోపిస్తున్నాడు. డెంజిల్ ఆరోపణలకు తగ్గట్లుగానే రీనా ఫోన్‌ నుంచి పోలీసులు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసారు. ఇందులో డెంజిల్‌... రీనా నువ్వు కోపం తగ్గించుకోవాలి అంటూ చేసే అభ్యర్ధన అతని ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అయితే కేవలం ఈ ఒక్క వీడియో ద్వారా రీనా మృతికి డెంజిల్‌ కారకుడా.. కాదా అనేది నిర్ధారించలేమని పోలీసులంటున్నారు. లోతుగా దర్యాప్తు చేసి త్వరలోనే నిజనిజాలు వెల్లడిస్తామని చెప్పుకొస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangil  Reena  Techie Suicide  Hyderabad  

Other Articles