Mohan Bhagwat: Don’t force anyone to say ‘Bharat Mata ki Jai’

Can t force anyone to say bharat mata ki jai rss chief

Shiv Sena,Mehbooba Mufti,PDP,Jammu and Kashmir,Bharat Mata ki Jai,BJP,Sanjay Raut, bharat mata ki jai, mohan bhagwat, rss, bharat ammi ki jai, lk advani, hail india chant controversy, hindutva politcs, rss leader bhagwat, bhagwat statement, bhagwat on bharat mata ki jai

Mohan Bhagwat said the Sangh was striving to raise more and more people who were committed to the cause of creating a great India.

భారత్ మాతాకీ జై అంశంపై ఆరెస్సెస్ కీ ఒక ఐడియా లేదా..?

Posted: 03/30/2016 03:10 PM IST
Can t force anyone to say bharat mata ki jai rss chief

బీజేపీతో చేతులు కలిపి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో కమలనాథులపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ప్రశ్నల వర్షం కురిపించింది. జమ్ముకశ్మీర్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మెహబూబా ముఫ్తి 'భారత్ మాతకీ జై' అని ఇప్పుడు నినదిస్తారా? అని శివసేన ప్రశ్నించింది. దీంతో డైలమాలో పడిన బీజేపి శివసేన ప్రశ్నలకు మౌనమే తన సమాధానమని చెప్పకనే చెప్పింది. ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన కశ్మీర్ పండిట్స్ గౌరవార్థం మెహబూబా ముఫ్తితో ఈ నినాదం చేయించగలరా? అని నిలదీయడంపై బీజేపి మిన్నకుండిపోయింది.

అయితే ఈ అంశాన్ని తమకు అనుకూలాంగా అత్యంత తెలివిగా మలిచింది బిజేపి పార్టీకి గాడ్ ఫాధర్ లా వ్యవహరించే ఆరెస్సెస్. యావత్ ప్రపంచం భారత్ మాతాకీ జై అనిపించాలని పిలుపునిచ్చిన మరుసటి రోజునే తన నిర్ణయంపై యూ టార్న్ తీసుకున్న ఆయన భారత్ మాతా కీ జై అనే అంశంపై ఎవరినీ వత్తిడి చేయవద్దని సూచించారు. మన దేశాన్ని అత్యంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే అప్పుడ ప్రపంచవ్యాప్తంగా అందరూ భారత్ మాతాకీ జై అని చెప్పకుండానే అంటారని అన్నారు. అయితే ఆయన మహబూబా ముఫ్తీ చేత భారత మాతాకీ జై అనిపిస్తారా..? అన్న అంశాన్ని అసలు పరిగణలోనికే తీసుకోలేదు. కానీ ఈ అంశంలో ఎవరనీ వత్తిడి చేయవద్దని మాత్రం సూచించారు.

కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపిని ఆరెస్సెస్ పక్కదారి పట్టిస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం కారణంగానే తాము భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో అధికారంలోకి వచ్చామని తేల్చిచెప్పిన ముక్తితో  కలసి బీజేపి అధికారాన్ని ఎలా పంచుకుంటుందన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఇదే సమయంలో శివసేన డిమాండ్ చేసినట్లు అమెతో భారత్ మాతాకీ జై అనిపిస్తారా..? అన్న పశ్నలకు ఇప్పటి వరకు సమాధానమే కరువయ్యింది. అయితే అసలు అరెస్సెస్ కు భారత్ మాతాకీ జై అనే అంశంలో్ ఒక ఐడియానే కొరవడిందన్న విమర్శలు వినబడుతున్నాయి.

మోహబూబా ముఫ్తీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా అమె పట్ల ఉదార వైఖరిని కనబర్చడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాదుల పట్ల ఆమె చూపిన ఆపేక్ష గతంలో వివాదాలు సృష్టించినా అమెతో కలసి బీజేపి అధికారాన్ని పంచుకోవడం అవసరమా..? అన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. భారత మాతకీ జై అనడం దేశభక్తికి, జాతీయవాదానికి చిహ్నంగా అభిప్రాయపడిన బీజేపి మెహబూబా ఈ నినాదాన్ని చేయగలరా?' అలాంటప్పుడు కొందరినే టార్గెట్ చేసి విమర్శలు కురిపించడమెందుకన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat mata ki jai  BJP  jammu and kashmir  mehbooba mufti  Shiv Sena  

Other Articles