One crore for one Dog

One crore for one dog

China, Dog, One Crore, One Dog One crore

Bengaluru Resident Sathish spent two crores for two dogs. He imported two pets form china.

కోటి రూపాయలకు ఒక కుక్క

Posted: 03/30/2016 12:38 PM IST
One crore for one dog

అవును... మీరు చదవింది అక్షరాల నిజం. ఒక్కో కుక్క దాదాపుగా కోటి రూపాయలు పెట్టి మరీ కొట్టాడు ఓ వ్యక్తి. కొరియా నుంచి తెప్పించుకున్న రెండు కుక్కలకోసం బెంగుళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి రూ. 2 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇలాంటి అరుదైన కుక్కలకోసం తాను ఇరవై ఏళ్ళుగా ప్రపంచమంతా వెదికాడట. బ్రీడింగ్ కుక్కలంటే తనకెంతో ఇష్టమని లూజ్ స్కిన్ తో ఉండే శునకాలంటే చాలా ఇష్టపడుతానని చెబుతున్నాడు. కొరియా నుంచి తెప్పించుకున్న ఈ రెండు కుక్కల్లో ఒకటి మగది కాగా రెండోది ఆడది.

ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ముఖ్యంగా మగ కుక్కకు మెడికల్ ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్టు సతీష్ తెలిపాడు. కొరియన్ దోస్తా మస్తిఫ్ అనే ఈ జాతి కుక్కలు 70 కేజీల వరకూ బరువుంటాయి. మనుషులతో స్నేహంగా మసలుకుంటాయి. వీటిని మూడు నెలల పాటు ఎయిర్ కండిషన్డ్ రూముల్లో ఉంచుతానని సతీష్ తెలిపాడు. వీటి ఆహారం ఇతరత్రా ఖర్చులకోసం నెలకు సుమారు పాతిక వేల వరకూ వదిలించుకోవలసి ఉంటుంది. వీటిని చూసేందుకు  ఈ శునక ప్రేమికుడి ఇంటి ముందు జనం బారులు తీరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Dog  One Crore  One Dog One crore  

Other Articles