Virat Kohli's Post On Anushka Sharma Goes Viral, He Attacks Trolls

Virat kohli slams twitterati for trolling anushka sharma

virat kohli, kohli, anushka sharma, anushka, kohli anushka, anushka virat, virat anushka, india vs australia, virat kohli twitter, ind vs aus, virat kohli anushka sharma, cricket news, sports news, sports

Virat Kohli took to Twitter to say that Anushka Sharma has always given him positivity and it's a shame that people are trolling her.

ఆమెను ఆడిపోసుకోవడం సిగ్గుచేటు.. ట్విట్టరిస్టులపై కోహ్లీ ఆగ్రహం

Posted: 03/28/2016 06:27 PM IST
Virat kohli slams twitterati for trolling anushka sharma

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. అదేంటి, ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి, భారత జట్టును సెమీస్‌లోకి సగర్వంగా తీసుకెళ్లినందుకు ఆస్ట్రేలియా మీడియా కూడా ప్రశంసించినా కోపం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ట్విట్టర్ జనాల తీరును చూసి విరాట్ మండిపడుతున్నాడు. బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడినందుకు విరాట్ కోహ్లీని అభినందిస్తూనే, ట్విట్టర్ జనాల్లో చాలామంది అనుష్కాశర్మతో విడిపోయిన తర్వాతే అతడి ఆట బాగుపడిందంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

అదంతా చూసి కోహ్లీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అనవసరంగా ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటారని తన ట్వీట్‌లో మండిపడ్డాడు. 'షేమ్' అని ఓ గోడమీద నల్లటి అక్షరాలతో రాసి ఉన్న ఫొటోను కూడా అతడు ట్వీట్ చేశాడు. అనుష్క ఎప్పుడూ తనకు సానుకూల మద్దతే ఇచ్చిందని, ఆమెను నాన్‌స్టాప్‌గా తిట్టడం సరికాదని అన్నాడు. చాలాకాలం పాటు ప్రేమలో మునిగిపోయిన కోహ్లీ, అనుష్క.. ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  anushka sharma  twitter comments  

Other Articles