Being Called A 'Fat Elephant' By Your Wife Is Enough For Divorce, Says Delhi High Court

Woman calls hubby mota haathi delhi hc says its enough for divorce

Mota Haathi, Delhi high court, Marital cruelty, Divorce cases, Calling husband fat is cruelty, matrimonial bond

Calling your overweight husband “mota haathi” (fat elephant) is grounds for divorce as it is “destructive of the matrimonial bond”, the Delhi high court has ruled .

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. భర్తను అలా తిట్టిందని భార్యకు విడాకులు

Posted: 03/27/2016 12:38 PM IST
Woman calls hubby mota haathi delhi hc says its enough for divorce

భార్యభర్తల విడాకుల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తాజాగా ఓ భార్యాభర్తల విషయంలో ఆసక్తికర తీర్పును ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వివరాలలోకి వెళితే, గతంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి.. లావుగా ఉండటం, భార్య లైంగిక వాంఛలను సంతృప్తిపరచకపోవడం వల్ల తన భార్య తనను క్రూరంగా హింసిస్తోందని, గున్న ఏనుగు అని తిడుతుందని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి 2012లో కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవల సదరు భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో విడాకులు ఇవ్వడం సబబేనని ఫ్యామిలీ కోర్టును సమర్థించింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు దీనిపై వివరణ ఇస్తూ.. లావుగా ఉన్న భర్తని భార్య గున్న ఏనుగు అని తిట్టడం కూడా తప్పేనని, ఈ కారణంతో కూడా భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చని, ఇలా తిట్టడం వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తుందని, కాబట్టి ఈ కారణంతో విడాకులు తీసుకోవచ్చునని తీర్పునిస్తూ స్పష్టం చేసింది. చివరగా జస్టిస్ విపిన్ సంఘీ మాట్లాడుతూ.. ఏనుగు, గున్న ఏనుగు, మోటా ఎలిఫెంట్ అన్న తిట్లు, దూషణలతో ఆమె తన భర్త ఆత్మగౌరవాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిందని పేర్కొనడం గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles