RSS Displeased At Extravagant Praise Of PM Modi As 'God's Gift'

Rss annoyed with bjp member s comment that modi s god s gift

Atal Bihari Vajpayee, LK Advani, Narendra Modi, Prime Minister, BJP, Narendra Modi, RSS, Venkaiah Naidu, assembly polls in five states, kerala, west bengal, tamilnadu, Assam, pudichery, Deendayal Shodh Sansthan, Assembly Elections,

The Rashtriya Swayamsevak Sangh or RSS has expressed its displeasure at BJP leaders describing Prime Minister Narendra Modi as "God's gift to India", sources have said.

బిజేపి నేతలకు ఆర్ఎస్ఎస్ సూచన.. ఎన్నికల ముందు వ్యక్తి పూజ వద్దు

Posted: 03/23/2016 06:52 PM IST
Rss annoyed with bjp member s comment that modi s god s gift

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పలు సూచనలు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు త్వరలో తెరలేవనున్న తరుణంలో వ్యక్తి పూజను మాని జాతీయత, అభివృద్ది కార్యక్రమాలే ఎజెండాగా ముందుకు కదలాలని హితువు పలికింది. అంతేకాదు బీజేపీ నేతలను ఓ మోస్తరుగా హెచ్చరించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీని 'దేవుడు ఇచ్చిన వరం' (గాడ్స్ గిఫ్ట్) అంటూ అభివర్ణించారు. ఈ విషయంపై ఆరెస్సెస్ కాస్త ఆవేశంగా ఉంది.

వ్యక్తి పూజ తగదని బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చురకలు అంటించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే మొదటికే మోసం వస్తుందని సంఘ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీని కీర్తిస్తూ వ్యాఖ్యలు వద్దని. పేదల పాలిట మెసయ్య అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యాలపూ అభ్యంతరం తెలిపింది. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంశాలను మాత్రమే తమ ప్రచార, ఇతర కార్యక్రమాలలో ప్రస్తావించాలని బీజేపీ నేతలకు సంకేతాలు పంపింది.

ప్రపంచ అగ్రనేతల్లోనే మోదీ ఒకరిని, ఆయన ఇండియాను పూర్తిగా మార్చివేస్తారంటూ వెంకయ్య నాయుడు పేర్కొనడంతో పాటు వ్యక్తిపూజ చేస్తున్నారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. కేవలం అభివృద్ది అంశాలపైనే దృష్టిసారించాలని మంత్రులు, బీజేపీ నేతలకు జాగ్రత్తలు సూచించింది. కాగా ప్రతిపక్షాలు మోడీ దేవుడా అన్న అంశాన్ని ప్రచారస్త్రాంగా చేయాలని, అందుకే ఈ అంశంపై కొద్ది మేరకు హెచ్చరికలు జారీ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రత్యర్థి రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రణాళికలు ఎలాగుంటాయో వేచి చూడాలి మరి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Narendra Modi  RSS  Venkaiah Naidu  assembly polls in five states  

Other Articles