Brussels attacks: Belgian authorities continue manhunt for suspects

Huge manhunt after is kills 36 in brussels bombings

Brussels terror attacks, brussels airport,Zaventem Airport, metro station, terminal buildings, explosions, Brussels, Salah Abdeslam, paris suicide bomber, paris blast attacker, isis, isis terrorist,

CCTV image of the three men thought to be responsible for the blasts, the man on the right is on the run.

‘బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు జరిపింది వీళ్లేనట’

Posted: 03/23/2016 03:50 PM IST
Huge manhunt after is kills 36 in brussels bombings

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు జరిపింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. క్రితం రోజు మధ్యాహ్నం జనసామర్థ్యం అధికంగా వున్న సమయంలో బ్రస్సెల్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ వద్ద రెండు పేలుళ్లతో పాటు ఆ తరువాత కోద్ది సేపటికి సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. విమానాశ్రయంలో 14 మంది మృతి చెందగా, మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుడులో 20 మంది మరణించారని అక్కడి మీడియా స్పష్టం చేసింది. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు లగేజీలో బాంబులు పెట్టుకుని వచ్చారని.. ఉగ్రవాదులు తమ లగేజీతో కారులో విమానాశ్రయానికి వచ్చారని జావెంటమ్ మేయర్ ఫ్రాన్సిస్ వెర్మీరిన్ వెల్లడించారు. సూటుకేసు బ్యాగుల్లో బాంబులు పెట్టుకుని ఎయిర్ పోర్టులోకి వచ్చారని చెప్పారు. వీటిని ట్రాలీల మీద పెట్టుకుని లోపలికి వచ్చారని, మొదటి రెండు బాంబు పేలాయని తెలిపారు. మరో ట్రాలీపై పెట్టిన మూడో బాంబు పేలలేదని, దీన్ని భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బాంబు నిర్వీర్య బృందం తర్వాత దీన్ని పేల్చివేసిందని వెల్లడించారు.

బాంబు పేలుళ్లతో ఎయిర్ పోర్టు రణరంగంగా మారిందని వ్యాఖ్యానించారు. ముష్కరుల హింసాకాండను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా, ఎయిర్ పోర్టు సహా మెట్రో స్టేషన్ వద్ద బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురి ఫొటోలను బెల్జియం పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, వారి పక్కనే నడుస్తున్న మరో టోపీవాలా కదిలికలను సీసీటీవీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు.. ఆ ముగ్గురే బాంబులు అమర్చినవారై ఉంటారని అనుమానిస్తున్నారు.

నల్లచొక్కాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఎడమ చేతులకు నల్లరంగు గ్లౌజులు ధరించారు. టోపీవాలా తెల్లనికోటు ధరించి, తలకు నల్లటి టోపీ పెట్టుకున్నాడు. ముగ్గురు దగ్గర ఒకే రకమైన బ్యాగులు ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన  సలాహ్ అబ్దెస్లామ్ను బ్రస్సెల్స్ లో అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీకార చర్యలతోనే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. పేలుళ్ల బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles