Brussels attack: At least 34 dead in suicide blasts at airport, metro explosion

Black day for belgium as deadly attacks hit brussels

Brussels terror attacks, brussels airport, metro station, terminal buildings, explosions, Brussels, Salah Abdeslam, paris suicide bomber, paris blast attacker, isis, isis terrorist,

A suicide bomber blew himself up at Brussels airport on Tuesday killing at least 14 people and a further blast tore through a rush-hour metro train in the capital shortly afterwards, claiming 20 lives.

పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమే..

Posted: 03/22/2016 06:27 PM IST
Black day for belgium as deadly attacks hit brussels

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఇవాళ సంభవించిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 36కు చేరిందని అక్కడి స్థానిక మీడియా వర్గాలు ప్రకటించాయి. బ్రస్సెల్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ వద్ద సంభవించిన రెండు పేలుళ్లతో పాటు ఆ తరువాత కోద్ది సేపటికి మెట్రో స్టేషన్ వద్ద సంభవించిన బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. విమానాశ్రయంలో 14 మంది మృతి చెందగా, మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుడులో 20 మంది మరణించారని అక్కడి మీడియా స్పష్టం చేసింది. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బ్రుస్సెల్స్లోని విమానాశ్రయంలో జంట పేలుళ్ల తరువాత బీభత్స వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో ఎక్కడ  చూసినా రక్తమేనని పేలుడుకు 10 నిమిషాల ముందు జెనీవా నుంచి విమానంలో వచ్చిన జాచ్ మౌజోన్  అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది చాలా పెద్ద పేలుడు. పరిస్థితి  దారుణంగా ఉంది... పైకప్పులు కూలిపోయి భయానకమైన పరిస్థితి నెలకొంది. పైప్ లైన్ పగిలి.. బాధితుల రక్తంతో కలిసిపోయి ప్రవహించింది.  గాయపడిన వారు,  వారి బ్యాగులతో ఈ  ప్రదేశమంతా రణరంగంలా మారి  భీతిగొల్పింది.

శిథిలాల మధ్య నడుచుకుంటూ వెళ్లా. ఇక్కడంతా  యుద్ధ సన్నివేశంలా ఉంది' అంటూ జాచ్ మౌజోన్ స్థానిక మీడియాకు వివరించాడు. మరోవైపు  చనిపోయిన వారిలో  భారతీయులెవ్వరూ లేరని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్  తెలిపారు.   అక్కడి   భారత రాయబారి  మంజీవ్ సింగ్  పురితో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brussels terror attacks  brussels airport  metro station  explosions  Brussels  Salah Abdeslam  

Other Articles