YSRCP MLAs wear black dress in todays ap assembly session

Ysrcp mlas wear black dress in todays ap assembly session

Roja, YSRCP, AP, Assembly, Jagan

YSRCP MLAs wear black dress in todays ap assembly session. They demand to justice for MLA Roja.

ITEMVIDEOS: నలుపు బట్టలతో వైసీపీ నిరసన

Posted: 03/19/2016 10:10 AM IST
Ysrcp mlas wear black dress in todays ap assembly session

ఏపి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సభలోకి నలుపు రంగు దుస్తువులతో హాజరయ్యారు. నిన్న రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం మీద వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సభ మొదలుకాగానే వైసీపీ ఎమ్మెల్యేలు రోజా అంశాన్ని లేవనెత్తారు.  కాగా స్పీకర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడంతో.. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు.

ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. జీరో అవర్ తర్వాత ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని, అంతవరకు సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరారు. అయినా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తూనే ఉన్నారు.కాగా ఏపి అసెంబ్లీలో అధికార విప‌క్షాలు బీపీ పెంచుకుని రోజు తెగ త‌న్నుకోవ‌డం అంతా టీవీల్లో చూస్తున్నారు…..ఈ స‌భా స‌మ‌రం మ‌రింత ముదిరి ఇప్పుడు వీధుల‌కెక్కినట్లు మామూలు జనాలు అనుకుంటున్నారు. రోజా తాజా ఎపిసోడ్‌తో ఏపీ అసెంబ్లీ ప‌రువు బ‌జారున ప‌డింద‌ని తెలుగు జ‌నం తెగ న‌వ్వుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  AP  Assembly  Jagan  

Other Articles