TRS will celebrate the formations on april27 in Khammam

Trs will celebrate the formations on april27 in khammam

TRS, Khammam, KCR, TRS party formation

TRS will celebrate the formations on april27 in Khammam. On this day TRS will take some important decisions about the party.

ఏప్రిల్ 27న ఖమ్మంలో TRS ఆవిర్భావ వేడుకలు

Posted: 03/19/2016 07:29 AM IST
Trs will celebrate the formations on april27 in khammam

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ మీటింగ్ లో… సీఎం కేసీఆర్ కీలక అంశాలపై నేతలకు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, నీటి ఎద్దడి, పశుగ్రాసం సమస్యలపై ఫోకస్ చేశారు సీఎం. మంత్రులు, ఎమ్మెల్యేలు… నియోజకవర్గాలవారీగా మీటింగ్ లు ఏర్పాటుచేసి సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. నిధుల సమస్యే లేదన్న కేసీఆర్.. కరువును సమర్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. ఖమ్మంలో ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని టీఆర్ఎస్ఎల్పీలో నిర్ణయించారు. ఉదయం ప్రతినిధుల సభ.. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపే… ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల లిస్ట్ ఇవ్వాలని సీఎం సూచించారు. త్వరలోనే పార్టీ కమిటీలు కూడా వేయాలని .. కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవాళ్లకు 2లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం కొనసాగించాలని నిర్ణయించారు. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేందుకు పెద్దఎత్తున విరాళాలు సేకరించాలన్న సీఎం పిలుపుతో… ఒక నెలజీతం ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు అంగీకరించారు. అసెంబ్లీ, మండలి తీరుతెన్నులపైనా చర్చించింది టీఆర్ఎస్ఎల్పీ. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గాల వారీగా… సీఎం కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. జనం సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేలా బస్సుయాత్రను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి అన్ని నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. పాలేరు ఉపఎన్నికలో పోటీ పెట్టొద్దనే ప్రతిపాదన ఏదీ రాలేదనీ…. ఒకవేళ వస్తే ఆలోచించాలని టీఆర్ఎస్ఎల్పీలో నేతలు నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Khammam  KCR  TRS party formation  

Other Articles