BJP Lawmaker Ganesh Joshi Accused Of Attacking Police Horse Shaktiman Arrested

Bjp lawmaker ganesh joshi accused of attacking police horse shaktiman arrested

BJP, MLA,. Ganesh Joshi, Police Horse Shaktiman, ganesh Joshi Arrested

BJP lawmaker Ganesh Joshi, accused of a brutal attack on Shaktiman the police horse during a protest on Monday, which left the animal crippled, has been arrested. Mr Joshi has been charged with cruelty and maiming an animal.

గుర్రం లేచింది.. ఎమ్మెల్యే అరెస్టు అయ్యాడు

Posted: 03/18/2016 12:50 PM IST
Bjp lawmaker ganesh joshi accused of attacking police horse shaktiman arrested

డెహ్రాడూన్ లో ఓ నిరసన కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే శక్తిమాన్ అనే గుర్రాన్ని కొట్టడం.. దేశవ్యాప్తంగా మీడియా సంచలనం చేసింది. అయితే పోలీస్ అశ్వికదళంలోని గుర్రాన్ని విచక్షణా రహితంగా కొట్టిన కేసులో ముస్సోరి బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌ జోషిని ఇవాళ అరెస్ట్‌ చేశారు డెహ్రాడూన్‌ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. సోమవారం బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు గుర్రాలపై వచ్చారు. నిరసనకారులను చెదగొట్టే సమయంలో… ఎమ్మెల్యే కర్రతో తీవ్రంగా కొట్టడంతో శక్తిమాన్‌ అనే 14 ఏళ్ల గుర్రం కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

పోలీస్ రెజిమెంట్ కు చెందిన శక్తిమాన్ అనే ఈ గుర్రానికి పది మంది డాక్టర్లు గుర్రానికి ఆపరేషన్ చేశారు. చివరికి గాయమైన కాలును తొలగించి.. స్టీల్ రాడ్ ఏర్పాటు చేశారు. అలా శక్తిమాన్ తన కాళ్లపై తాను నిలబడేట్టు చేశారు. అయితే శక్తిమాన్ ఇంతకు ముందులా నడవలేదని స్పష్టం చేశారు డాక్టర్లు. మరో పక్క తాను గుర్రాన్ని కొట్టలేదని ఓ గోతిలో పడ్డం వల్ల గుర్రం కాలికి గాయమైందని తెలిపారు గణేశ్‌జోషి. అంతకు ముందు బిజెపి నాయకులు కొంత మంది ఆ గుర్రాన్ని పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  MLA  . Ganesh Joshi  Police Horse Shaktiman  ganesh Joshi Arrested  

Other Articles