AP Assembly session going fire

Ap assembly session going fire

Roja, YSRCP, AP, Assembly, Jagan, High Court, Governor, Narasimhan

On the YSRCp MLA Roja issue shacking AP Assembly. Roja got permission to attend ap assembly sessions. But Assembly mashals not allowing roja

ఏపి అసెంబ్లీలో రోజా వివాదం.. కోర్టులో మరో పిటిషన్

Posted: 03/18/2016 11:28 AM IST
Ap assembly session going fire

ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావణం నెలకొంది. సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీకి చేరుకున్నారు. ఆమె రాక సందర్భంగా అసెంబ్లీలోకి ప్రవేశించే అన్ని మార్గాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్‌ను మోహరించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలోకి వెళ్తున్న రోజాను మార్షల్స్ ,పోలీసులు అడ్డుకున్నారు. రోజా హైకోర్టు ఉత్తర్వులను చూపించినప్పటికి మార్షల్స్ ఆమెను అడ్డుకున్నారు. స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం మిమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి మాత్రమే అనుమతిస్తామని..లోపలికి వెళ్లడానికి వీల్లేదంటూ చీఫ్ మార్షల్ అన్నారు. కొద్ది సేపటికి ప్రతిపక్షనేత జగన్ అక్కడికి చేరుకుని చీఫ్ మార్షల్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో సంగతి తేలేవరకు అంతా ఇక్కడే ఉంటామని వైసీపీ ఎమ్మెల్యేలు గేట్‌-2 వద్ద బైఠాయించారు.

ఏపి అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొన్న తర్వాత వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్, రోజాతో పాటు కొంతమందిని వెంటేసుకొని గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు బయలురేరారు. మరోపక్క హైకోర్టులో రోజా విషయంలో వచ్చిన తీర్పుపై పిటిషన్ దాఖలైంది. కాగా హైకోర్టు ఆ పిటిషన్ ను సోమవారం నాడు విచారణకు స్వీకరించనుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, మంత్రులు రోజా మీద అసెంబ్లీ పాయింట్ వద్ద విమర్శలు గుప్పించారు. జగన్, రోజా తదితరులు గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు బయలుదేరినా కానీ గవర్నర్ నరసింహన్ అందుబాటులో లేరు. మొత్తానికి రొజా వ్యవహారం రోజురోజుకు ఏపి అసెంబ్లీలో హాట్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  AP  Assembly  Jagan  High Court  Governor  Narasimhan  

Other Articles