YSRC's no-trust motion against Speaker defeated in Andhra assembly

Ysrc s no trust motion against speaker defeated in andhra assembly

YSRCP, AP, Assembly, Shivaprasad, Assembly Speaker

The no-Confidence motion against Andhra Pradesh Assembly Speaker Dr K. Shivaprasada Rao has been defeated by 40 votes. While 97 members opposed it, 57 members voted in favour of the No-Confidence motion moved by the opposition YSR Congress Party.

ఏపి అసెంబ్లీ స్పీకర్ పై వీగిన అవిశ్వాస తీర్మానం

Posted: 03/15/2016 07:12 PM IST
Ysrc s no trust motion against speaker defeated in andhra assembly

ఏపి అసెంబ్లీ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి మద్దతుగా 57 ఓట్లు, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. తటస్థులు ఎవరైనా ఉంటే నిలబడాలని కోరగా ఎవరూ నిలబడలేదు. దీంతో స్పీకర్ పై అవిశ్వాసం వీగిపోయినట్టుగా డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. తర్వాత స్పీకర్ కోడెలను చైర్లోకి డిప్యూటి స్పీకర్ ఆహ్వానించారు. సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో సభ్యులు నిలబడి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కోరగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అందరూ నిలబడ్డారు. అనంతరం అవిశ్వానికి వ్యతిరేకంగా అధికార టీడీపీ, బీజేపీ సభ్యులు లేచి నిలబడ్డారు.

తనపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తరువాత స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరిగి శాసనసభకు అధ్యక్షత వహించారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించిన వైసీపీపై తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందని చెప్పిన కోడెల తనకు తెలిసి ప్రతిపక్షంపై ఎటువంటి వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అసెంబ్లీకి వివరించారు. సభానాయకుడిగా తన సపోర్ట్ ఎప్పుడూ స్పీకర్కు ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తరువాత సభలో మాట్లాడిన చంద్రబాబు కోడెల శివప్రసాద్ చేసిన సేవలను గుర్తుచేశారు. స్పీకర్గా తన బాధ్యతను కోడెల శివప్రసాద్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి ఆయనపై సభ్యులు చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకోవద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  AP  Assembly  Shivaprasad  Assembly Speaker  

Other Articles