Achem naidu slams Jagan and He challenge to prove his statements

Achem naidu slams jagan and he challenge to prove his statements

Ap, Assembly, Achem naidu, Chandrababu Naidu, Solar Project, jagan, YSRCP

Jagan said that huge corruption in solar project. But Achem naidu slams Jagan and He challenge to prove his statements

ITEMVIDEOS: జగన్.. మగాడివైతే అవినీతిని నిరూపించు

Posted: 03/15/2016 07:20 AM IST
Achem naidu slams jagan and he challenge to prove his statements

ఏపి అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల మాటలు కోటలు దాటాయి. వారి మాటలు వ్యక్తగతంగా ఆరోపనలు చేసుకునే వరకు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణల మీద అధికార పార్టీ నాయకులు ముప్పేద దాడికి దిగారు. కాగా మంత్రి అచ్చెన్నాయుడు ఓ అడుగు ముందుకు వేసి దూషణల పర్వానికి తెర తీశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ధర్నాపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ నిరంతరం రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా ఉండకపోతే జగన్ కు నిద్రపట్టదని విమర్శించారు. జగన్ కులాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కాపుల్లో చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్కు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. బీసీలకు నష్టం కలుగకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

సోలార్ పవర్ వ్యవహారంలో అవినీతి జరిగినట్టు జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. టెండర్లే పిలవని ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో 7 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ అనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.అయితే పదేపదే ప్రతిపక్ష వైపు నుంచి వస్తున్న రన్నింగ్ కామెంటరీకి ఒక్కసారిగా మంత్రి అచ్చెనాయుడు జగన్ పై ఫైర్ అయ్యాడు. దమ్ముంటే, మగాడివాతే, రాయలసీమ బిడ్డవైతే నిజాలు నిరూపించు అని ఆవేశంగా మాట్లాడారు. అనంతరం మంత్రి తమ ప్రభుత్వం పై జగన్ చేస్తున్న అసత్యాలు, అవినీతి ఆరోపణలు నిరూపిస్తే క్రీయాశీల రాజకీయాలనుండి శాస్వతంగా తప్పుకుంటానని లేకపోతే జగన్ తక్షణమే తట్టబట్టు సర్దుకుపోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Assembly  Achem naidu  Chandrababu Naidu  Solar Project  jagan  YSRCP  

Other Articles