PM owes an answer why Vijay Mallya was allowed to leave India, says Arvind Kejriwal

Why was mallya allowed to leave kejriwal asks modi

Vijay Mallya, Arvind Kejriwal, Kingfisher Airlines, Narendra Modi, Delhi, Aam Aadmi Party, Enforcement Directorate, Kingfisher Airlines, CBI, wilful defaulter

Delhi CM Arvind Kejriwal asked Prime Minister Narendra Modi to answer why Vijay Mallya, the founder of the now defunct Kingfisher Airlines (KFA), was allowed to leave the country.

విజయ్ మాల్యాను దేశం నుంచి ఎలా వెళ్లనిచ్చారు..?

Posted: 03/13/2016 03:32 PM IST
Why was mallya allowed to leave kejriwal asks modi

ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడంపై స్పందించిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి, అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తూర్పారబడ్డారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్‌ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్‌ విజయ్‌మాల్యాను దేశం నుంచి ఎలా వెళ్ల‌నిచ్చార‌ని దేశ‌ప్ర‌ధానికి కేజ్రీవాల్ ప్ర‌శ్న వేశారు. ఇప్ప‌టికే ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం శివ‌సేన కూడా కేంద్రాన్ని ఈ విష‌య‌మై ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.  

మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమ‌ర్శించారు. సమస్యల్లో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ ద్వారా మండిప‌డ్డారు. బ్యాంకులు ముందుకు రాకపోయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుమోటోగా కేసు నమోదు చేసినా.. మాల్యాను దేశం ఎలా వదిలేలా చేశారని ప్రశ్నించారు.

సిబీఐ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాల‌ని కోరారు. మాల్యా మార్చి 2వ తేదీ ఎవరి అనుమతితో దేశం విడిచి వెళ్ళారని అన్నారు. మాల్యాపై ఉదంతంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు, ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం శివ‌సేన మండిప‌డుతుంటే మాజీ ప్ర‌ధాని దేవేగౌడ, విజయ్‌మాల్యా మాజీ పార్ల‌మెంట్ స‌హ‌చ‌రుడు ఫ‌రూఖ్ అబ్దుల్లా నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోన్న విష‌యం తెలిసిందే.    

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Arvind Kejriwal  Narendra Modi  Kingfisher Airlines  CBI  wilful defaulter  

Other Articles