Aadhar Bill passed in Lok Sabha

Aadhar bill passed in lok sabha

Aadhar, UID, Aadhar Bill, Loksabha, Arun Jaitley, Modi, NDA

The Lok Sabha on Friday passed the Aadhaar Bill that aims to ensure targeted services to intended beneficiaries by assigning them unique identity numbers. These numbers will be given to each person who has stayed in India for 182 days in the year preceding the date of application.

ఆధార్ కు చట్టబద్ధత

Posted: 03/12/2016 07:26 AM IST
Aadhar bill passed in lok sabha

దేశవ్యాప్తంగా ప్రతీసారి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలా వద్దా అనేది చర్చ.. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుుడు నాటి ప్రభుత్వం ఆధార్ ను ప్రవేశపెట్టింది. తాజాగా వచ్చిన యుూపిఎ ప్రభుత్వం
దాన్ని అన్ని పథకాలకు లింక్ చేస్తూ.. ఆధార్కు చట్టబద్దత కల్పించింది. యూనిక్ ఐడెంటిటీ నెంబర్-గా పేర్కొనే 'ఆధార్'కు చట్టబద్ధత లభించింది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ కార్డును అనుసంధానించే క్రమంలో 'ఆధార్'కు చట్టబద్ధత కల్పించే బిల్లును శుక్రవారం లోక్‌-సభ ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధార్ అనుసంధానంపై సభలో వివరణ ఇచ్చారు.

దేశంలో 97శాతం మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారన్నారు. ఆధార్ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, బయో మెట్రిక్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోబోమని జైట్లీ స్పష్టం చేశారు. వ్యక్తిగత
సమాచార భద్రతకు భంగం వాటిల్లకుండా బిల్లులో నిబంధనలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. యుఐడిని పౌర ఆమోదపత్రం కింద నమోదు చేస్తామని వివరించారు. ఈ బిల్లులోని క్లాజ్‌ 9ని
అనుసరించి ఓ వ్యక్తి, అతనికి సంబంధించిన వివరాలను ఆధార్‌ నంబర్‌ తెలిసినంత మాత్రాన వెల్లడించే హక్కు ఉండదని జైట్లీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రోజుకు 5 నుంచి 7 లక్షల మంది ఆధార్ నమోదు చేయించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ ఆధార్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆధార్ కార్డు ద్వారా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం పథకాలను వర్తింపజేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhar  UID  Aadhar Bill  Loksabha  Arun Jaitley  Modi  NDA  

Other Articles