'Killing Rajiv Gandhi Was LTTE's Biggest Mistake', Leader Reportedly Said

Killing rajiv gandhi was our biggest mistake admits ltte leader

Rajiv Gandhi assassination, LTTE on Rajiv Gandhi, anton balasingham on rajiv gandhi, balasingham to end a civil war, balasingham humiliation with mark salter, ltte, ltte chief, rajiv gandhi, rajiv gandhi assasination, vellupillai prabhakaran

Rajiv Gandhi’s assassination was no less than a blunder, confided LTTE’s chief political strategist and negotiator Anton Balasingham in a new book ‘To end a civil war’ by Mark Salter.

రాజీవ్ గాంధీని హత్యమార్చడం.. మేము చేసిన అతిపెద్ద తప్పు..

Posted: 03/11/2016 12:02 PM IST
Killing rajiv gandhi was our biggest mistake admits ltte leader

‘‘భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసి పెద్ద తప్పు చేశామని’’ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) సిద్ధాంతకర్త ఆంటన్ బాలసింగమ్ తన అంత్యకాలంలో తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడట. రాజీవ్ గాంధీ లాంటి నేతను హతమార్చాలన్నది తమ విధానాలకే విరుద్ధం. చాలా దురదృష్టకరం అని ఆయన నిత్యం బాధపడేవారట. ఈ మేరకు శ్రీలంకలో నార్వే మాజీ ప్రత్యేక దూత ఎరిక్ సోలిమ్ ను ఉటంకిస్తూ రచయిత మార్క్ సాల్టర్ తాను రాసిన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’పుస్తకంలో పేర్కొన్నారు.

గతంలో సోలిమ్ ను కలిసిన బాలసింగమ్... రాజీవ్ హత్యపై పశ్చాత్తాపాన్ని ప్రకటించారని సాల్టర్ పేర్కొన్నారు. అయితే సోలిమ్ తో బాలసింగమ్ మాట్లాడిన విషయాలన్నీ అనధికారికమేనని సాల్టర్ తన పుస్తకంలో స్పష్టం చేశారు. ఇటీవలే మార్కెట్ లోకి  వచ్చిన ఈ పుస్తకం ఆధారంగా రాజీవ్ హత్యకు సంబంధించి ఎల్టీటీఈ అనుసరించిన దాగుడు మూతల వైఖరి కొనసాగిందట. అయితే సిద్దాంతకర్తకే తెలియకుండా రాజీవ్ గాంధీ హత్య జరిగిందని, రాజీవ్ హత్య తరువాత చాలా కాలం నాటికి ఈ విషయాన్ని ప్రభాకరన్ తన ముందు అంగీకరించాడని.. దీంతోనే బాలసింగమ్ తీవ్రంగా పశ్చాతాపపడ్డాడని తెలిపాడని సాల్టర్ పేర్కోన్నాడు.

రాజీవ్ గాంధీ తిరిగి భారత ప్రధానిగా బాధ్యతలు చేపడితే తమపై మూకుమ్మడి దాడి జరగడం ఖాయమన్న భావనతోనే ఎల్టీటీఈ చీఫ్ ‘పెద్ద పులి’ ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అయితే సంస్థ సిద్ధాంతకర్తగా ఉన్న బాలసింగమ్ వద్ద ఈ విషయాన్ని దాచిన ప్రభాకరన్... తన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మాన్ తో కలిసి కార్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత చాలాకాలం వరకూ రాజీవ్ హత్య తమ పని కాదని ప్రభాకరన్ చెబుతూ వచ్చాడు. చాలాకాలానికి బాలసింగమ్ వద్ద ప్రభాకరన్ అసలు విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత లండన్ లో ఆశ్రయం పొందిన బాలసింగమ్ 2006లో కేన్సర్ తో మరణించాడు. చనిపోవడానికి ముందు రాజీవ్ హత్యపై ఆయన భారత్ ను క్షమాపణ కోరేందుకు యత్నించి విఫలమయ్యాడు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ltte  ltte chief  rajiv gandhi  rajiv gandhi assasination  vellupillai prabhakaran  

Other Articles